రణబాలికి ఆ రెండు హంగామాలు లేవు!
సినిమా రిలీజ్ అనగానే టికెట్ రేట్ల పెంపు, పెయిడ్ ప్రీమియర్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి.
సినిమా రిలీజ్ అనగానే టికెట్ రేట్ల పెంపు, పెయిడ్ ప్రీమియర్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. ఈ రెండు హంగామాలతోనే సగం క్రేజ్ తెచ్చుకోవాలని మేకర్స్ చూస్తున్నారు. కానీ విజయ్ దేవరకొండ నటిస్తున్న రణబలి టీమ్ మాత్రం ఈ రెగ్యులర్ ట్రెండ్ కు పూర్తిగా భిన్నమైన దారిలో వెళ్తోంది. ట్రైలర్ లాంచ్ లో మైత్రీ నిర్మాతలు తీసుకున్న నిర్ణయాలు ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఏపీ, తెలంగాణలో రణబలి కోసం ఎలాంటి అదనపు ధరలు ఉండవని నిర్మాత నవీన్ క్లారిటీ ఇచ్చేశారు. భారీ బడ్జెట్ సినిమా అనగానే ఒక 50 రూపాయలు పెంచుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం. అయినా సరే సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్ లలో రెగ్యులర్ రేట్లకే సినిమా చూపించబోతున్నారు. రీసెంట్ గా రవితేజ ఇరుముడి సినిమాను కూడా ఇలాగే సాధారణ రేట్లతో రిలీజ్ చేసి సక్సెస్ కొట్టామని నిర్మాత రవిశంకర్ గుర్తు చేశారు.
ఇరుముడి బడ్జెట్ వేరు, రణబలి స్కేల్ వేరు. అయినప్పటికీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడమే మెయిన్ టార్గెట్ గా మైత్రీ సంస్థ ఈ రిస్క్ తీసుకుంటోంది. దీనికి తోడు పెయిడ్ ప్రీమియర్ల కల్చర్ కు కూడా రణబలి దూరంగా ఉంటోంది. రిలీజ్ కు ముందు రోజు రాత్రి ఎలాంటి స్పెషల్ షోలు వేయడం లేదు. నిర్మాతలు తీసుకున్న ఈ రెండు నిర్ణయాల వల్ల తొలిరోజు కలెక్షన్స్ లెక్కలు పూర్తిగా మారిపోతాయి.
ముందస్తు ప్రీమియర్స్ వసూళ్లు ఉండవు, పెంచిన టికెట్ రేట్ల వల్ల వచ్చే అదనపు ఆదాయం ఉండదు. కాబట్టి ఫస్ట్ డే థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు పడినా, బాక్సాఫీస్ ఫిగర్స్ లో భారీ మ్యాజిక్ కనిపించకపోవచ్చు. కేవలం షోల నెంబర్, ఆక్యూపెన్సీ స్పీడ్ మీదే టోటల్ ఓపెనింగ్స్ ఆధారపడి ఉంటాయి. ఈ బాక్సాఫీస్ లెక్కల మధ్య సినిమా రన్ టైమ్ మీద కూడా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఒక క్లారిటీ ఇచ్చాడు.
సినిమా ఏకంగా మూడు గంటలకు పైగా ఉంటుందనే ప్రచారానికి చెక్ పెడుతూ, రెండు గంటల యాభై నిమిషాలకే లాక్ చేశామని చెప్పాడు. ఒక ఎపిక్ పీరియాడిక్ డ్రామాకు ఈ మాత్రం నిడివి అవసరమే. దీని ఆధారంగానే థియేటర్ల ఓనర్స్ రోజుకు ఎన్ని షోలు వేయాలనేది ప్లాన్ చేసుకునే పనిలో పడ్డారు. అక్టోబర్ 16న థియేటర్లలోకి వస్తున్న రణబలికి మేకర్స్ తీసుకున్న ఈ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. టికెట్ రేట్లు అందుబాటులో ఉంటే ఫ్యామిలీస్, యూత్ ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఆర్టిఫిషియల్ హైప్ కు దూరంగా, కేవలం కంటెంట్ ను నమ్ముకుని మేకర్స్ వేసిన ఈ ప్లాన్ విజయ్ ఖాతాలో ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.