తమన్ మార్క్, హుక్ స్టెప్.. అర్జున 'ఎల్లో చున్నీ' ఎలా ఉందంటే?
టాలీవుడ్ యంగ్ హీరో అనీష్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న సినిమా ఇట్లు అర్జున. మహేశ్ ఉప్పల ఆ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో అనీష్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న సినిమా ఇట్లు అర్జున. మహేశ్ ఉప్పల ఆ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తున్న ఆ చిత్రంలో మాలీవుడ్ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ సినిమా అక్టోబర్ 30న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది.
ఇప్పటికే ఆ సినిమా నుంచి రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. లేటెస్ట్ గా మూడో సాంగ్ గా ఎల్లో చున్నీని మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తమన్ మ్యూజిక్ అందించిన ఆ పాటకు విశాల్ మిశ్రా, తమన్ కలిసి గాత్రం అందించారు. శ్రీజో సాహిత్యం అందించారు. ఎల్లో చున్నీ పాటలో హీరో, హీరోయిన్ మధ్య ఉండే క్యూట్ మూమెంట్స్ ను చూపించారు మేకర్స్.
ఏదో విషయానికి హీరోయిన్ అలిగి మూడీగా ఉంటే.. ఆమెను బుజ్జగించేందుకు హీరో చేసే ప్రయత్నాలను పాట రూపంలో చూపించారు. దీంతో పాట మొత్తం ఫన్నీగా, హుషారుగా సాగుతుంది. తమన్ తన మార్క్ ట్రెండీ బీట్స్ తో పాటను ఆకట్టుకునేలా కంపోజ్ చేశారు. విశాల్ మిశ్రా వాయిస్ సాంగ్ కు మంచి ఫీల్ తీసుకొచ్చిందని చెప్పాలి. ఇక తమన్ కూడా గొంతు కలపడంతో సాంగ్ లో జోష్ మరింత పెరిగింది.
శ్రీజో రాసిన లిరిక్స్ కూడా ఇప్పటి యూత్ కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ప్రేమలో ఉండే చిన్న చిన్న అలకలు, బుజ్జగింపులను సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేశారు. సాంగ్ కు సునీల్ సున్నపు, ఫాల్గుణి బంగేరా కొరియోగ్రఫీ అందించారు. ఇందులోని హుక్ స్టెప్ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకునేలా ఉంది. యూత్ ఆ స్టెప్ ను సోషల్ మీడియా రీల్స్ లో ఫాలో అయ్యే అవకాశం కనిపిస్తోంది.
అనీష్, అనస్వర రాజన్ మధ్య కెమిస్ట్రీ కూడా పాటకు మరో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇద్దరూ కలిసి వేసిన డ్యాన్స్ మూవ్స్, ఎక్స్ప్రెషన్స్ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. అలా మెలోడీ, ట్రెండీ బీట్స్, యూత్ ఫుల్ లిరిక్స్, లీడ్ పెయిర్ కెమిస్ట్రీ కలిసి ఎల్లో చున్నీ పాటను వినడానికి, చూడటానికి బాగుండే సాంగ్ గా మార్చాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు..
ఇట్లు అర్జున చిత్రానికి రాజా మహదేవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రామ్ కుమార్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు చూస్తున్నారు. కోటి కే ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. యాక్షన్ సీన్స్ కు దిలీప్ సుబ్బరాయన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇట్లు అర్జునపై ఇంట్రెస్ట్ పెరుగుతోంది. ఇప్పుడు ఎల్లో చున్నీ పాట కూడా అదే స్పీడ్ ను కంటిన్యూ చేసేలా కనిపిస్తోంది. అక్టోబర్ 30న సినిమా థియేటర్లలోకి రానుండటంతో.. అప్పటివరకు మేకర్స్ ప్రమోషనల్ కంటెంట్ తో ఇంకెంత హైప్ పెంచుతారో వేచి చూడాలి.