సైరాకు రణబలికి లింక్.. ఆ రెండు రూమర్లకు చెక్

ఒక పెద్ద సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్నప్పుడు దాని చుట్టూ రకరకాల గాసిప్స్ పుట్టుకురావడం ఇండస్ట్రీలో కామన్.

Update: 2026-10-08 14:51 GMT

ఒక పెద్ద సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్నప్పుడు దాని చుట్టూ రకరకాల గాసిప్స్ పుట్టుకురావడం ఇండస్ట్రీలో కామన్. అందులోనూ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ అనగానే పాత సినిమాలతో పోలికలు, రన్ టైమ్ మీద రూమర్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతాయి. ఇవి పబ్లిక్ లోకి బలంగా వెళితే ఫస్ట్ డే ఓపెనింగ్స్ మీద గట్టి ప్రభావం పడుతుంది. సరిగ్గా ఈ పాయింట్ ను పసిగట్టిన డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్, రణబలి ట్రైలర్ లాంచ్ వేదికగా రెండు పెద్ద పుకార్లకు చెక్ పెట్టేసి తన క్లారిటీ ఏంటో చూపించాడు.

ట్రైలర్ లో రాయలసీమ యాస, ఆంగ్లేయులపై పోరాటం చూడగానే చాలామందికి వెంటనే మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా గుర్తొచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ఈ రెండు సినిమాలకు లింక్ పెడుతూ చర్చలు మొదలయ్యాయి. ఈ ప్రచారం ఇలాగే వదిలేస్తే సినిమాకు డ్యామేజ్ జరుగుతుందని గ్రహించిన రాహుల్, మైక్ పట్టుకుని సైరాకు రణబలికి ఎలాంటి సంబంధం లేదని కుండబద్దలు కొట్టాడు.

ఆ కథా నేపథ్యం వేరని, తమ సినిమా సోల్ పూర్తిగా వేరని స్పష్టం చేశాడు. నిజానికి ఇలా ముందే అంచనాలను బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం. జనాలు సైరా లాంటి స్కేల్ తో వస్తే, ఇక్కడ కరువు నేపథ్యంలో సాగే ఎమోషనల్ డ్రామా చూసి నిరాశపడే ప్రమాదం ఉంది. ఇప్పుడు రాహుల్ ఇచ్చిన స్టేట్మెంట్ తో ఆడియన్స్ మైండ్ సెట్ మారిపోతుంది. రణబలిని ఒక యూనిక్ కథగా, మహా కరువు నుంచి పుట్టిన ఒక వీరుడి ప్రయాణంగా చూసేందుకు ప్రేక్షకులకు అవకాశం దొరుకుతుంది.

ఇక రాహుల్ క్లియర్ చేసిన రెండో పెద్ద రూమర్ సినిమా నిడివి. గత వారం రోజులుగా రణబలి రన్ టైమ్ ఏకంగా 3 గంటల 15 నిమిషాలు ఉందంటూ నెట్టింట ఒక రేంజ్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి. నేటి జనరేషన్ ఆడియన్స్ కు మూడుంపావు గంటల సినిమా అంటే థియేటర్ కు రావడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కథ ఎంత బాగున్నా నిడివి ఎక్కువైతే కలెక్షన్స్ కు పెద్ద స్పీడ్ బ్రేకర్ పడినట్లే.

ఈ కన్ఫ్యూజన్ ను డైరెక్టర్ చాలా సింపుల్ గా తీసేశాడు. సినిమా లెంగ్త్ కేవలం 2 గంటల 50 నిమిషాలు మాత్రమే అని పక్కా లెక్క చెప్పేశాడు. ఒక చారిత్రక ఎపిక్ డ్రామాను ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ మాత్రం సమయం తీసుకోవడం సహజమే. ఇప్పుడున్న ట్రెండ్ కు పర్ఫెక్ట్ కమర్షియల్ మీటర్. ముందే ఈ లెక్క చెప్పేయడంతో ప్రేక్షకులకు ఒకరకమైన భారం దించినట్లయింది. ఇక సినిమా చుట్టూ అల్లుకున్న రెండు ప్రధానమైన అపోహలను చాలా లాజికల్ గా కట్ చేశాడు. తప్పుడు అంచనాలతో థియేటర్ కు వచ్చి డిసప్పాయింట్ అవ్వకుండా, తమ కంటెంట్ ఏంటో పరిమితులు ఏంటో చెప్పి మంచి పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశాడు. సరైన అంచనాలతో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16న బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.





Tags:    

Similar News