శృతి హాసన్.. పర్సనల్ ఫ్రీడమ్ కు లిమిట్స్ ఎక్కడ?
హీరోయిన్లు తమ పర్సన్ లైఫ్ పై మాట్లాడటం కొత్తేమీ కాదు. కానీ కొన్ని విషయాలపై ఓపెన్ గా మాట్లాడితే మాత్రం వెంటనే డిబేట్ స్టార్ట్ అవుతుంది.
హీరోయిన్లు తమ పర్సన్ లైఫ్ పై మాట్లాడటం కొత్తేమీ కాదు. కానీ కొన్ని విషయాలపై ఓపెన్ గా మాట్లాడితే మాత్రం వెంటనే డిబేట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ చేసిన కామెంట్స్ కూడా అలాంటి చర్చనే మొదలుపెట్టాయి. అయితే ఆమె చేసిన కామెంట్స్ కంటే.. దాని వెనుక ఉన్న ఆలోచన ఏంటనేదే అసలు అబ్జర్వ్ చేయాల్సిన విషయం.
శ్రుతి హాసన్ రీసెంట్ గా సెల్ఫ్ కేర్, పర్సనల్ ఫ్రీడమ్ వంటి విషయాలపై మాట్లాడారు. ఆ సమయంలో సె*క్స్ టాయ్స్ ను కూడా సెల్ఫ్ కేర్ లో భాగంగా చూడొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ విషయంలో ఇతరుల పర్మిషన్ అవసరం లేదని, ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత నిర్ణయాలను తామే తీసుకునే ఫ్రీడమ్ ఉండాలని చెప్పారు. ఇక్కడ శ్రుతి చెప్పిన అసలు పాయింట్ ఒక వస్తువు గురించి మాత్రమే కాదు.
మన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన నిర్ణయాలపై సొసైటీ ఎంతవరకు ఎఫెక్ట్ చూపించాలనేదే ఆమె కామెంట్స్ లో కనిపిస్తున్న మెయిన్ ఎలిమెంట్. ముఖ్యంగా పర్సనల్ లైక్స్, రిలేషన్స్, బాడీ, ప్రైవసీ వంటి విషయాల్లో ఇతరులు చేసే జడ్మెంట్లకు భయపడకుండా.. తమకు ఏది కంఫర్ట్ గా ఉంటుందో దానిని వ్యక్తులు నిర్ణయించుకోవాలన్నది ఆమె అభిప్రాయంగా కనిపిస్తోంది.
అయితే మన సొసైటీలో ఇలాంటి విషయాలు ఇప్పటికీ కామన్ గా మారలేదు. అందుకే శ్రుతి కామెంట్స్ బయటకు వచ్చిన వెంటనే ఆమె చెప్పిన విషయం కంటే.. ఆమె ఎందుకు ఇలా మాట్లాడారనే యాంగిల్ లో ఎక్కువగా చర్చ జరుగుతోంది. కొందరికి ఇది పర్సనల్ ఫ్రీడమ్ గురించి చెప్పిన జస్ట్ ఒపీనియన్ గా కనిపిస్తే.. మరికొందరికి మాత్రం ఇలాంటి విషయాలను బహిరంగంగా మాట్లాడటం అవసరమా అనే ప్రశ్న రావచ్చు.
అందుకే శ్రుతి ఒపీనియన్ తప్పా? ఒప్పా? అనే విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది. నిజానికి ఆమె కామెంట్స్ ను అందరూ ఒకే విధంగా చూడాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత ఎంపికల విషయంలో ఎవరి అభిప్రాయం వారిదే. అయితే పర్సన్ ఫ్రీడమ్ అంటే బాధ్యత కూడా ఉండాలనే విషయం కూడా అంతే ముఖ్యమైనది. ఏ వ్యక్తిగత నిర్ణయమైనా అది తనకు, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండటం అవసరం.
మరోవైపు సెల్ఫ్ కేర్ అనే పదానికి కూడా అర్థం మారుతుంది. గతంలో ఇది హెల్త్, రెస్ట్, పీస్ ఫుల్ నెస్ వంటి విషయాలకే ఎక్కువగా పరిమితమయ్యేది. ఇప్పుడు పర్సనల్ కంఫర్ట్, ప్రైవసీ, ఎమోషనల్ నీడ్స్ అవసరాలు కూడా ఇందులో భాగంగా చర్చకు వస్తున్నాయి. శ్రుతి కామెంట్స్ ను కూడా మారుతున్న థింకింగ్ ప్రాసెస్ లో చూడొచ్చు.
అందుకే ఆమె మాటలను కేవలం బో*ల్డ్ కామెంట్స్ గా చూడటం కంటే.. పర్సనల్ ఫ్రీడమ్, ప్రైవసీ, సామాజిక తీర్పులపై ఆమె చెప్పిన అభిప్రాయంగా చూడటం బెటర్. అయితే యాక్సెప్ట్ చేయాలా లేక వ్యతరేకించాలా అనేది ఎవరి వ్యక్తిగత ఆలోచన వారిదే. కానీ సాధారణంగా మాట్లాడటానికి ఇబ్బంది పడే అంశంపై శ్రుతి మరోసారి తన అభిప్రాయాన్ని క్లియర్ గా చెప్పారని అనడంలో డౌట్ అక్కర్లేదు.