ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్ అంత స్పెషల్‌గా ఉండబోతోందా? రెబల్ ఫ్యాన్స్‌ అంచనాలు పీక్స్!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23 దగ్గరకు వస్తున్న కొద్దీ అత‌డి అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంటోంది.

Update: 2026-10-08 18:30 GMT

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23 దగ్గరకు వస్తున్న కొద్దీ అత‌డి అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంటోంది. ప్రతి ఏటా డార్లింగ్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునే ఫ్యాన్స్ ఈసారి మాత్రం దాన్ని మరో లెవెల్‌కి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. వరుస పాన్ ఇండియా విజయాలతో దూసుకుపోతున్న ప్రభాస్ తాజా సినిమాల అప్‌డేట్స్ కోసం అభిమానులు, సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ బర్త్‌డే వేడుకలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న రకరకాల చర్చలు, పుట్టుకొస్తున్న రూమర్స్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇక ఈ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ వార్ డ్రామా `ఫౌజీ` గురించిన ఆసక్తికర విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక ప్రత్యేకమైన టీజర్ లేదా అదిరిపోయే కొత్త లుక్‌ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడి నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ చిత్రానికి సంబంధించి అదే రోజు సినిమా కొత్త రిలీజ్ డేట్‌పై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.

ప్రస్తుతం `ఫౌజీ` షూటింగ్ విషయానికొస్తే.. చిత్ర యూనిట్ సినిమాలోని అత్యంత కీలకమైన ఇంటర్వెల్ సీక్వెన్స్ షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈ నెల 12వ తేదీ నాటికి ప్రస్తుత షెడ్యూల్ పూర్తి కానుండగా.. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు దాదాపు నెల రోజుల పాటు జరగనున్న సుదీర్ఘ షెడ్యూల్‌లో హై-వోల్టేజ్ క్లైమాక్స్ వార్ పార్ట్ ... పెండింగ్‌లో ఉన్న రెండు భారీ యాక్షన్ ఫైట్స్ షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఈ షెడ్యూల్‌తో సినిమా టాకీ పార్ట్ దాదాపు పూర్తిగా కొలిక్కి వస్తుందని సమాచారం.

ప్ర‌భాస్ న‌టించిన భారీ పాన్ ఇండియా సక్సెస్ ల త‌ర‌హాలోనే ఆ స్థాయిలో గ్రాండ్‌గా కనిపించే చిత్రం ఇదే అవుతుందని నిర్మాతలు చెబుతున్న సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్- టీసిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా.. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, సజ్జాద్ దెలాఫ్రూజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కేవలం `ఫౌజీ` మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ రేంజ్‌లో ఉన్న `కల్కి 2898 ఏడి` సీక్వెల్ .. `సలార్ 2` సినిమాల గురించి కూడా డార్లింగ్ పుట్టినరోజు నాడే కొత్త అప్‌డేట్లు వెలువడతాయని ఫ్యాన్స్ గుసగుసలాడుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ అక్టోబర్ 23 మాత్రం ప్రభాస్ అభిమానులకు మరపురాని మధురమైన ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News