గమనించారా.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఇది కామన్!

సినీ ఇండస్ట్రీలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు ఎలాంటి ఇంపార్టెన్స్ ఉందో అందరికీ తెలిసిందే.;

Update: 2025-10-27 07:43 GMT

సినీ ఇండస్ట్రీలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు ఎలాంటి ఇంపార్టెన్స్ ఉందో అందరికీ తెలిసిందే. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ.. అభిమానుల్లో ఆసక్తి రేపడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఏ మూవీకి అయినా అతిపెద్ద ప్రమోషనల్ ఈవెంట్‌ గా వ్యవహరిస్తుంది. సినిమా విజయానికి పునాది వేస్తుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించడంలో కూడా సహాయపడుతుంది.

దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ పై ఆయా సినిమాల మేకర్స్ ప్రత్యేక దృష్టి కచ్చితంగా పెడతారు. అందుకోసం ప్రత్యేక బడ్జెట్ కూడా కచ్చితంగా కేటాయిస్తున్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులను ఆహ్వానించడం, పాటలు, ట్రైలర్ ను ప్రదర్శించడం వంటివి చేయడం ద్వారా ప్రేక్షకుల ఫోకస్ సినిమా వైపు పడేలా చేస్తున్నారు.

అదే సమయంలో చీఫ్ గెస్టులను తీసుకురావడంలో నిర్మాతలు ఇప్పుడు కొత్త స్ట్రాటజీని అమలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. తాము రూపొందించిన సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు.. తమ బ్యానర్ పై రానున్న అప్ కమింగ్ చిత్రాల హీరోలను గెస్ట్ లుగా ఆహ్వానిస్తున్నారు. కొంత కాలంగా నిర్మాతలు ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. రీసెంట్ ఈవెంట్స్ లో అది కామన్ గా కనిపిస్తోంది.

రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి.. విశ్వక్ సీన్ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను నిర్మించిన సాహు గారపాటితోనే చిరు.. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు మూవీ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అలా చిరు.. సాహు నిర్మించిన లైలా మూవీ ప్రమోషన్స్ లో సందడి చేశారు.

ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. కూడా కాంతార చాప్టర్ 1 ఈవెంట్ కు వచ్చిన సంగతి తెలిసిందే. గాయంతో బాధపడుతున్నా కూడా.. వేదికపై మాట్లాడారు. ఆ మూవీని నిర్మించిన హోంబలే ఫిలింస్ తోనే ఇప్పుడు తారక్ వర్క్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీని హోంబలే ఫిలింస్ నిర్మిస్తోంది.

ఇప్పుడు యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ తన నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రానున్న మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మంగళవారం సాయంత్రం నిర్వహించనున్నారు. ఆ వేడుకకు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చీఫ్ గెస్ట్ గా రానున్నారు. అయితే సూర్యతో నాగవంశీ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సూర్యను ఇన్వైట్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొత్త ట్రెండ్ ను నాగవంశీ కూడా ఫాలో అయ్యారు. మరి ఫ్యూచర్ లో ఇంకెంతమంది చేస్తారో చూడాలి.

Tags:    

Similar News