• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కంగువా ఎఫెక్ట్.. నిర్మాత...

కంగువా ఎఫెక్ట్.. నిర్మాత కోసం మరొకటి!

| కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రీసెంట్ గా కంగువా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-11-22 23:30 GMT

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రీసెంట్ గా కంగువా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. క్రీస్తుశకం 1000 - 1100 శతాబ్దాల మధ్య జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా పీరియాడికల్ మూవీగా కంగువాను సిరుతై శివ తెరకెక్కించారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, హీరోయిన్ దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆ సినిమా.. మొదటిరోజే మిక్స్‌ డ్ టాక్ అందుకుంది.

ఆ ఎఫెక్ట్ సినిమా వసూళ్లపై బాగా పడింది. తొలిరోజు సూర్య కెరీర్‌ లో ది బెస్ట్‌ వసూళ్లను కంగువా రాబట్టినా.. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద మాత్రం తేలిపోయిందని చెప్పాలి. కొద్ది రోజుల క్రితం దాదాపు 12 నిమిషాల పాటు రన్ టైమ్ ను ట్రిమ్ చేసిన మేకర్స్.. రెండో వారంలో వసూళ్లు పుంజుకుంటాయన్న ఆశతో ఉన్నారు. కానీ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. మేకర్స్ కు భారీ నష్టాలు వచ్చే అవకాశం కనిపిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

అయితే కంగువాను ఇప్పటి వరకు ఎవరూ చూడని అందమైన లొకేషన్స్ లో షూట్ చేశారు మేకర్స్. అనేక మంది ప్రముఖ టెక్నీషియన్స్ ను రంగంలోకి దింపారు. దీంతో సినిమా షూటింగ్ ఖర్చులు, రెమ్యునరేషన్లు, ప్రమోషన్ ఖర్చులు కలిపి రూ.350 కోట్లకు పైగా అయినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. రిలీజ్ కు ముందు మేకర్స్ క్రియేట్ చేసిన బజ్ తో థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు టాక్.

కానీ వసూళ్లు అనుకున్న స్థాయిలో లేకపోవడంతో కంగువా.. కోలీవుడ్ ఇండస్ట్రీలో గేమ్ ఛేంజర్ గా మారుతుందన్న ఆశలు గాలిలో కలిసిపోయాయి. సినిమా నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగిల్చడం ఖాయం! ఇంకా రూ.100 కోట్ల మార్కును కూడా దాటనట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాతకు మద్దతుగా సూర్య రంగంలోకి ఇప్పుడు దిగినట్లు సమాచారం. స్టూడియో గ్రీన్ పిక్చర్స్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో ఓ చిన్న సినిమాలో నటించేందుకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

తక్కువ బడ్జెట్ తో ఆ సినిమాను నిర్మించాలని సూర్య సూచించారని తెలుస్తోంది. దాని ద్వారా కంగువా నష్టాలను కొంత మేర పూడ్చుకోవాలని తెలిపారని టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో రెమ్యునరేషన్ కూడా తక్కువ మొత్తంలో తీసుకోనున్నారని ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో సూర్య తీసుకున్న నిర్ణయం పట్ల అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.

అయితే సూర్య చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కార్తీక్‌ సుబ్బరాజుతో ఓ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేశారు. దాంతోపాటు కమెడియన్ ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్నారు. అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఇటీవల వచ్చింది. అది పూర్తయ్యాక.. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై చేయాల్సిన చిన్న సినిమాను స్టార్ట్ చేయనున్నారని వినికిడి. మరి అది నిజమో కాదో తెలియాల్సి ఉంది.

Tags:    
  • Kanguva 
  • Suriya 
  • Dishapatani 
  • Bobbydeol 
  • Filmindustry 
  • Tjgnanavel 
  • Socialmedia 
  • Studiogreenpictures 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS