సరైన దారి తెలియకపోయినా.. విజయ్ బాటలో మాత్రం నడవని సూర్య!
| రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని హీరో సూర్య స్పష్టం చేశారు. రాజకీయాలను ద్వేషించడం లేదని, దగ్గరగా గమనిస్తున్నానని తెలిపారు. అవినీతిని మూడో వ్యక్తి నిర్మూలించలేరని, అంకితభావంతో ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చని వ్యాఖ్యానించారు. సరైన దారి తెలియకపోయినా తాను రాజకీయాల్లోకి రానని చెప్పడంతో ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
తమిళ సినిమా ఇండస్ట్రీలో హీరో సూర్యకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే తమిళ సినిమాల్లోనే కాకుండా తెలుగు సినిమాల్లో కూడా ఈయన ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. నటనతోనే కాకుండా తన వ్యక్తిత్వం, ప్రవర్తనతో కూడా ఆయన ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా సూర్య జ్యోతికను చూసుకునే విషయం వల్ల ఆయనకు అమ్మాయిల ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.
ఈ క్రమంలో తాజాగా సూర్య ఒక విషయం గురించి చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ అమ్మాయిలను ఆకట్టుకుంటుంది. తమిళనాడు రాజకీయాలకు, సినిమా హీరోలకు చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. గతంలో ఎంజీఆర్, కమల్ హాసన్ వంటి ప్రముఖ నటులు రాజకీయాల్లోకి వచ్చి తమదైన ముద్ర వేశారు. ఇక ఇప్పుడు దళపతి విజయ్ కూడా రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. ఈ క్రమంలో సూర్య కూడా రాజకీయాల్లోకి వస్తారా అన్న అనుమానాలు చాలామందిలో వచ్చాయి. ముఖ్యంగా అమ్మాయిల్లో సూర్య ఎక్కడ రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలో వదిలేస్తారా అని బాధపడిన వాళ్లు కూడా ఉన్నారు.
ఈ క్రమంలో ఇటీవల తన సీన్ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న సూర్య రాజకీయాల గురించి మాట్లాడారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని.. కానీ వాటిని దగ్గరగా గమనిస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "నేను రాజకీయాల్లోకి రావడం లేదు. అంతమాత్రాన నాకు రాజకీయాలంటే ద్వేషం ఉందని కాదు. నేను రాజకీయాలను నిశ్శబ్దంగా, చాలా దగ్గరగా గమనిస్తున్నాను" అని అన్నారు.
అవినీతి గురించి మాట్లాడుతూ, "అవినీతిని మూడో వ్యక్తి వచ్చి నిర్మూలించలేరు. పూర్తి అంకితభావంతో ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు" అని అన్నారు.
అయితే సూర్య చివరగా చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. "నాకు సరైన దారి తెలియకపోయినా రాజకీయాల్లోకి మాత్రం రాను" అని స్పష్టం చేశారు. మొత్తానికి సూర్య సరైన దారి తెలియకపోయినా.. తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు విజయ్, కమల్ హాసన్ లాంటి వాళ్లు ఫాలో అయిన దారి మాత్రం తను ఫాలో అవ్వని క్లియర్ గా చెప్పినట్టు అయింది.