సూర్యపై కన్నేసిన మన 'కంటెంట్' డైరెక్టర్లు.. ఆ ఛాన్స్ ఎవరికో?

కోలీవుడ్ స్టార్ సూర్యకు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే మన వాళ్లు సొంత హీరో సినిమా లాగే చూస్తారు.;

Update: 2025-11-29 23:30 GMT

కోలీవుడ్ స్టార్ సూర్యకు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే మన వాళ్లు సొంత హీరో సినిమా లాగే చూస్తారు. ఇప్పుడు ఆ అభిమానాన్ని క్యాష్ చేసుకోవడానికి, సూర్యతో సినిమా చేయడానికి మన తెలుగు దర్శకులు పోటీ పడుతున్నారు. అది కూడా రొటీన్ డైరెక్టర్లు కాదు, కంటెంట్ ను బలంగా నమ్మే ఇద్దరు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లు సూర్యకు కథలు వినిపించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఆ ఇద్దరు మరెవరో కాదు.. 'సరిపోదా శనివారం'తో తనదైన మార్క్ చూపించిన వివేక్ ఆత్రేయ, 'ఉప్పెన'తో సెన్సేషన్ సృష్టించి ప్రస్తుతం చరణ్ తో 'పెద్ది' తీస్తున్న బుచ్చిబాబు సానా. వీరిద్దరూ ఇటీవల సూర్యను కలిసి తమ స్క్రిప్టులను నెరేట్ చేశారట. ఈ రెండు కథలు సూర్యకు ఇంట్రెస్టింగ్ గా అనిపించాయని, అయితే ఎవరితో ముందు వెళ్లాలనే దానిపై ఆయన ఆలోచనలో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

వివేక్ ఆత్రేయ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. 'అంటే సుందరానికీ', 'సరిపోదా శనివారం' వంటి సినిమాల్లో ఆయన మార్క్ స్క్రీన్ ప్లే, రైటింగ్ చాలా కొత్తగా ఉంటాయి. సూర్య ఎప్పుడూ వైవిధ్యాన్ని, ప్రయోగాలను కోరుకుంటారు కాబట్టి, వివేక్ చెప్పిన కొత్త పాయింట్ ఆయనకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ గట్టిగానే ఉంది. ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లేతో సూర్యను లాక్ చేయాలని వివేక్ ప్లాన్.

మరోవైపు బుచ్చిబాబు సానా రూటు వేరు. ఆయన ఎమోషన్స్ ను, రస్టిక్ బ్యాక్ డ్రాప్ ను అద్భుతంగా డీల్ చేస్తారు. ప్రస్తుతం రామ్ చరణ్ తో చేస్తున్న 'పెద్ది' పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఆ సినిమా తర్వాత బుచ్చిబాబు క్రేజ్ మారుతుంది. అలాంటి మాస్ అండ్ ఎమోషనల్ కథతో సూర్యను మెప్పించాలని బుచ్చిబాబు గట్టిగానే ట్రై చేస్తున్నాడు. సూర్యలోని నటుడికి బుచ్చిబాబు కథ ఫీస్ట్ లా ఉంటుందనే టాక్ ఉంది.

ప్రస్తుతం సూర్య.. జితు మాధవన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే ఆయన తన తర్వాతి సినిమాను ప్రకటించాల్సి ఉంది. బహుశా ఆ లక్కీ ఛాన్స్ ఈ ఇద్దరు తెలుగు దర్శకుల్లో ఒకరికి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. క్లాస్ టచ్ ఉన్న వివేక్ ఆత్రేయనా? లేక మాస్ ఎమోషన్ ఉన్న బుచ్చిబాబునా? సూర్య ఓటు ఎవరికో చూడాలి.

మన తెలుగు దర్శకులు ఇప్పుడు తమిళ స్టార్లను టార్గెట్ చేయడం మంచి విషయమే. సూర్య ఎవరిని ఎంచుకున్నా, అది తెలుగు ప్రేక్షకులకు పండగే. గతంలో మన దర్శకులతో సూర్య చేయాలని అనుకున్నా సెట్టవ్వలేదు. త్రివిక్రమ్ బోయపాటి లాంటి వాళ్లు ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు ఈ కంటెంట్ ఉన్న దర్శకులకు సూర్యా ఎంత త్వరగా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.

Tags:    

Similar News