సంక్రాంతి ఫైట్ నుంచి ఒకరు ఔట్.. పర్ఫెక్ట్ స్ట్రాటజీ!
అందుకే, సంక్రాంతి గొడవకు వారం గ్యాప్ ఇచ్చి, జనవరి 23 (శుక్రవారం)ను లాక్ చేశారు. ఇది చాలా స్మార్ట్ మూవ్. ఎందుకంటే, ఆ తర్వాత జనవరి 26, రిపబ్లిక్ డే, సోమవారం వస్తోంది.;
కోలీవుడ్ స్టార్ సూర్య తన కెరీర్‌ను ఇప్పుడు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు. 'కంగువ' లాంటి భారీ ప్రయోగం తర్వాత, ఒకవైపు తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో తన 46వ సినిమా చేస్తూ టాలీవుడ్‌కు దగ్గరవుతున్నాడు. మరోవైపు, తనదైన స్టైల్‌లో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా లైన్‌లో పెడుతున్నాడు. ఈ లిస్ట్‌లోని ముఖ్యమైన సినిమా 'కరుప్పు'.
ఆర్జే బాలాజీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై కోలీవుడ్‌తో పాటు తెలుగులోనూ మంచి అంచనాలున్నాయి. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ఒక ఇంట్రెస్టింగ్ బజ్ బయటకు వచ్చింది. 'కరుప్పు' టీమ్ ఈ సినిమాను 2026, జనవరి 23న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోందట. ఈ డేట్ వెనుక ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఉంది.
సాధారణంగా జనవరి అంటే అందరూ సంక్రాంతి ఫైట్ గురించే ఆలోచిస్తారు.
కానీ, 2026 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పెద్ద రణరంగమే జరగనుంది. ప్రభాస్ రాజా సాబ్, చిరంజీవి ' మన శంకర వర ప్రసాద్ గారు, విజయ్ 'జన నాయకుడు', రవితేజ 'RT76', నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు.. ఇలా పెద్ద లిస్టే ఉంది. ఇంత హెవీ కాంపిటీషన్ మధ్యలో రావడం కంటే, కాస్త ఆగడం బెటర్ అని సూర్య టీమ్ భావించినట్లుంది.
అందుకే, సంక్రాంతి గొడవకు వారం గ్యాప్ ఇచ్చి, జనవరి 23 (శుక్రవారం)ను లాక్ చేశారు. ఇది చాలా స్మార్ట్ మూవ్. ఎందుకంటే, ఆ తర్వాత జనవరి 26, రిపబ్లిక్ డే, సోమవారం వస్తోంది. అంటే, సినిమాకు శుక్ర, శని, ఆదివారాలతో పాటు, సోమవారం హాలిడే కూడా కలిసి వచ్చి, ఏకంగా 4 రోజుల లాంగ్ ఓపెనింగ్ వీకెండ్ దొరుకుతుంది.
సంక్రాంతికి ఉన్న పోటీ రిపబ్లిక్ డేకి ఉండదు. కానీ, ఫెస్టివల్ హాలిడే అడ్వాంటేజ్ మాత్రం దొరుకుతుంది. అంటే, ఎలాంటి పోటీ లేకుండా సోలోగా ఫెస్టివల్ కలెక్షన్లను కొల్లగొట్టే ప్లాన్ ఇది. ఆర్జే బాలాజీ సినిమాలు మూకుత్తి అమ్మన్, వీట్ల విశేషం లాంటి డినిమాలు చేశాడు. సాధారణంగా అతని సినిమాలు కంటెంట్ బలంగా ఉండి, మౌత్ టాక్‌తో క్రేజ్ అందుకుంటాయి. అలాంటి దర్శకుడి సినిమాకు ఈ 4 రోజుల లాంగ్ వీకెండ్ దొరకడం అనేది జాక్‌పాట్ లాంటిది.
మొత్తానికి, సూర్య ఒకవైపు పాన్ ఇండియా మార్కెట్ కోసం కష్టపడుతూనే, మరోవైపు తన సినిమాలకు ఇలాంటి స్మార్ట్ రిలీజ్ డేట్స్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ రిపబ్లిక్ డే స్ట్రాటజీ గనుక వర్కవుట్ అయితే, కరుప్పు సినిమాతో సూర్య మరో సాలిడ్ హిట్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయం.