సూర్య మ‌రో ర‌క్త చ‌రిత్ర‌?

త‌మిళ స్టార్ హీరో సూర్య న‌టించిన ఇటీవ‌లి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడ‌లేదు. కంగువ‌తో పాన్ ఇండియా హిట్ కొట్టాల‌ని క‌ల‌లు గ‌న్న సూర్య ఆశ‌లు అడియాస‌లే అయ్యాయి.;

Update: 2025-06-20 18:30 GMT

త‌మిళ స్టార్ హీరో సూర్య న‌టించిన ఇటీవ‌లి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడ‌లేదు. కంగువ‌తో పాన్ ఇండియా హిట్ కొట్టాల‌ని క‌ల‌లు గ‌న్న సూర్య ఆశ‌లు అడియాస‌లే అయ్యాయి. ఆ త‌ర్వాత రెట్రో కూడా ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. అందుకే అత‌డు న‌టిస్తున్న త‌దుప‌రి చిత్రాల‌పై అభిమానులు ఆరాలు తీస్తున్నారు.

ఆ కోవ‌లో చూస్తే ఆర్.జే బాలాజీతో సూర్య 45 చిత్రంపైనే అంద‌రి దృష్టి ఉంది. సూర్య ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసాడు. తాజాగా ద‌ర్శ‌కుడు ఆర్జే బాలాజీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా టైటిల్ ని అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ చిత్రానికి కరుప్పు అని టైటిల్ ఫిక్స్ చేసారు. 20 సంవత్సరాల తర్వాత సూర్య - త్రిష కృష్ణన్ ఈ చిత్రంతో తిరిగి జంట‌గా న‌టిస్తున్నారు. ఈ జంట చివరిసారిగా 2005 యాక్షన్ థ్రిల్లర్ `ఆరు`లో కలిసి నటించారు. కరుప్పు లో ఐదవ సారి క‌లిసి న‌టిస్తున్నారు. దర్శకుడి పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుద‌ల చేయ‌గా వెబ్ లో వైర‌ల్ గా మారుతోంది. కరుప్పు బాలాజీ - సూర్యల తొలి కలయికలో వ‌స్తోంది. పోస్టర్ ప్ర‌కారం.. ఈ సినిమా యాక్షన్-హెవీగా ఉంటుందని భావించ‌వ‌చ్చు. సూర్య కత్తి పట్టుకుని సీరియ‌స్ గా క‌నిపించ‌డంతో ఇది మ‌రో యాక్ష‌న్ చిత్ర‌మ‌ని అర్థ‌మ‌వుతోంది. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ చూడ‌గానే సూర్య మ‌రోసారి ర‌క్తం చిందిస్తున్నాడా? అన్న సందేహం అభిమానులకు క‌లిగింది.

కరుప్పు RJ బాలాజీ కెరీర్ మూడవ చిత్రం. ఈ ప్రాజెక్ట్ అక్టోబర్ 2024లో అధికారికంగా ప్రకటించ‌గా, చిత్రీకరణ నవంబర్ 2024లో తమిళనాడులో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని S. R. ప్రభు -S. R. ప్రకాష్ బాబు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప‌తాకంపై నిర్మిస్తున్నారు. NGK తర్వాత ఇదే బ్యాన‌ర్ లో సూర్యతో రెండో సినిమా. దీపావ‌ళి కానుక‌గా ఈ సినిమా విడుద‌ల‌వుతుంద‌ని స‌మాచారం.

Tags:    

Similar News