కార్తీక్ సుబ్బరాజ్ 'రెట్రో'.. ఈసారి ఏం జరుగుతుందో?

కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ప్రముఖ హీరో సూర్య లీడ్ రోల్ లో నటిస్తున్న మూవీ రెట్రో.;

Update: 2025-04-20 11:30 GMT
Suriyas Retro Look & Karthik Subbaraj’s Signature Style Spark Buzz

కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ప్రముఖ హీరో సూర్య లీడ్ రోల్ లో నటిస్తున్న మూవీ రెట్రో. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఆ సినిమా... ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమవుతోంది. మే 1వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న రెట్రో సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

రెట్రో.. లవ్, యాక్షన్, వయోలెన్స్ మూవీగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అదే సమయంలో రెట్రో లుక్ లో సూర్య అదరగొట్టినట్లు అర్థమవుతోంది. పూజా నేచురల్ గా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా కార్తీక్ సుబ్బరాజ్ స్టైల్ లో రెట్రో ట్రైలర్ కూడా చాలా ఫాస్ట్ గా.. ఫుల్ యాక్షన్ తో సాగిందనే చెప్పాలి.

ట్రైలర్ లో గ్రిట్టీ విజువల్స్, లేయర్డ్ స్టోరీ టెల్లింగ్.. ఇవన్నీ కార్తీక్ సుబ్బరాజ్ సిగ్నేచర్ స్టైల్. అయితే ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. సోషల్ మీడియాలో తెలుగు ఆడియన్స్ నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ కాస్త కన్ఫ్యూజన్ గా ఉందని చెబుతున్నారు. సినిమా స్టోరీలైన్ తోపాటు ఎమోషన్స్ అర్థం కాలేదని అంటున్నారు.

అయితే కార్తీక్ సుబ్బరాజ్ స్టోరీ టెల్లింగ్.. తెలుగు ప్రేక్షకుల్లో చాలా మందికి పెద్ద ఎక్కదు. ఇది ఇప్పటికే పలుమార్లు ప్రూవ్ అయింది. పెట్టా, మహాన్, జిగర్తాండ డబుల్ ఎక్స్ వంటి సుబ్బరాజ్ గత సినిమాల విషయంలో అదే జరిగింది. అలా అని నచ్చినవారు లేరని కాదు.. కొందరు స్పెషల్ ఆడియన్స్.. ఆయన సినిమాలకు ఎట్రాక్ట్ అయిపోతారు.

అదే సమయంలో కోలీవుడ్ లో కూడా కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలు.. కమర్షియల్ గా కన్నా కల్ట్ హిట్స్ గానే ఎక్కువగా నిలుస్తాయి. కొన్ని అరుదుగా బ్లాక్ బస్టర్ హిట్ స్టేటస్ పొందుతాయి. దీంతో ఇప్పుడు రెట్రో విషయంలో ఏం జరుగుతుందనే హాట్ టాపిక్ గా మారింది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక కల్ట్ హిట్ అవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

స్టోరీ లైన్ క్లియర్ గా తెలియడం లేదని చెబుతున్నారు. మరికొందరు.. ట్రైలర్ కన్నా మూవీ వచ్చాక అసలు విషయం తెలుస్తుందని అంటున్నారు. ఇప్పటి నుంచి ఊహాగానాలు కరెక్ట్ కాదని కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి రెట్రో మూవీ కోసం సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. మరి చివరకు రెట్రో మూవీ ఎలా ఉంటుందో.. కార్తీక్ తెలుగు ఆడియన్స్ ను మెప్పిస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News