'తగలబడిపోయిన కొంపలో'.. రాజా రవీంద్ర ఎవరికోసం అన్నారో..

రాజా రవీంద్ర తన ఎక్స్ ఖాతాలో.. 'తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే' అంటూ ఓ పోస్ట్ పెట్టారు.

Update: 2026-09-25 09:39 GMT

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజా రవీంద్ర సోషల్ మీడియాలో లేటెస్ట్ గా పెట్టిన ఓ చిన్న పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది. ఆయన ఎవరినీ టార్గెట్ చేయలేదు! ఎవరి పేరూ చెప్పలేదు.. ఏ విషయం గురించి అన్నదీ వివరించలేదు. కానీ ఆయన రాసుకొచ్చిన ఒక్క పోస్ట్ మాత్రం నెటిజన్లలో రకరకాల చర్చలను స్టార్ట్ చేసింది. దీంతో ఆ పోస్ట్ వెనుక అసలు మ్యాటర్ ఏంటనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారింది.

రాజా రవీంద్ర తన ఎక్స్ ఖాతాలో.. 'తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే' అంటూ ఓ పోస్ట్ పెట్టారు. ఒక్క లైన్ తో ఉన్న ఆ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది. అయితే ఆయన ఆ కామెంట్స్ ఎందుకు అన్నారు, ఎవరిని ఉద్దేశించి పెట్టారు, ఏదైనా స్పెషల్ మూమెంట్ ను దృష్టిలో పెట్టుకున్నారా అనే విషయాలపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

సాధారణంగా ఒక ఇంట్లో ఎంత విలువైన వస్తువులు ఉన్నా.. ఆ ఇల్లే కాలిపోతే వాటితో యూజ్ ఉండదన్నది రాజా రవీంద్ర పోస్ట్ కు సింపుల్ అర్థం. అయితే ఆయన ఆ కామెంట్ ను ఏ సందర్భంలో పెట్టారన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ముఖ్యంగా ఎలాంటి క్లారిటీ లేకుండా ఆ ఒక్క లైన్ ను మాత్రమే షేర్ చేయడంతో నెటిజన్లు తమకు నచ్చిన అర్థాలు వెతుక్కుంటున్నారు.

ఇండస్ట్రీలో జరుగుతున్న ఏదైనా విషయాన్ని ఉద్దేశించి ఆయన ఆ పోస్ట్ పెట్టారా, లేక పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయమా అనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు మాత్రం ఇది ఎవరికో ఇచ్చిన ఇన్ డైరెక్ట్ మెసేజ్ కావచ్చని భావిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇందులో అంత ప్రత్యేకమైన అర్థం ఉండకపోవచ్చని అంటున్నారు.

రాజా రవీంద్రకు టాలీవుడ్‌ లో చాలాకాలంగా ఉన్న పరిచయాలు, ఇండస్ట్రీ వ్యవహారాలపై ఆయనకు ఉన్న అవగాహన కారణంగా.. ఇలాంటి పోస్ట్ వచ్చిన ప్రతిసారి కూడా ఇంట్రెస్ట్ పెరగడం సహజమే. గతంలో కూడా ఆయన కొన్ని ఇంటర్వ్యూల్లో ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలను ముక్కుసూటిగా మాట్లాడారు. దీంతో ఇప్పుడు ఆయన పెట్టిన ఆ ఒక్క పోస్ట్ కూడా నార్మల్ సోషల్ మీడియా పోస్టులా కాకుండా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

అయితే రాజా రవీంద్ర మాత్రం ఆ పోస్ట్‌ లో ఎవరినీ డైరెక్ట్ గా ప్రస్తావించలేదు. ఏ ఘటన గురించి మాట్లాడుతున్నారో కూడా చెప్పలేదు. దీంతో అసలు ఆయన ఉద్దేశం ఏంటనేది ప్రస్తుతానికి ఆయనకే తెలుసు. సోషల్ మీడియాలో మాత్రం చర్చ మాత్రం ఆగడం లేదు. ఏదేమైనా.. 'తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే' అంటూ రాజా రవీంద్ర చేసిన పోస్ట్ వెనుక ఉన్న అసలు కారణాన్ని ఆయనే చెప్తే తప్ప దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. మరి మీ ఒపీనియన్ ఏంటి? మీకేం అనిపిస్తుంది?

Tags:    

Similar News