వీడియో : స్వర్గంలో మరో రోజు స్టార్ కపుల్
కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జోడీ చాలా అన్యోన్యంగా ఉంటారు.;
కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జోడీ చాలా అన్యోన్యంగా ఉంటారు. పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన జ్యోతిక పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. దాదాపుగా దశాబ్ద కాలం పాటు సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్న జ్యోతిక పిల్లలు పెద్ద వారు కావడంతో పాటు, కుటుంబ బాధ్యతలు తగ్గడంతో సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీలో వరుస సినిమాలు చేస్తూ వచ్చింది. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే జ్యోతిక ముంబై షిప్ట్ అయింది. సూర్య మాత్రం తమిళనాడులో ఉండటంతో అంతా వీరిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది అంటూ పుకార్లు షికార్లు చేశాయి.
బాలీవుడ్ సినిమాల్లో నటించిన జ్యోతికతో సూర్య విభేదాల గురించి జాతీయ మీడియాలోనూ ప్రముఖంగా వార్తలు వచ్చాయి. పిల్లలు ముంబైలో జ్యోతిక వద్ద ఉంటున్నారని, అతి త్వరలోనే వీరిద్దరు అధికారికంగా బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఆ పుకార్లు నిజం కాదని ఎప్పటికప్పుడు వీరిద్దరు చెబుతూ వచ్చారు. అయినా కూడ ఆ పుకార్లు ప్రచారం జరిగేవి. ఈ మధ్య కాలంలో రెగ్యులర్‌గా వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. దాంతో ఆ పుకార్లకు చెక్ పెట్టినట్లు అయింది. తాజాగా మరోసారి జ్యోతిక ఒక అందమైన వీడియోను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.
సూర్యతో కలిసి తూర్పు ఆఫ్రికాలోని సీషెల్స్ కి జ్యోతిక వెళ్లింది. ఆమె అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. బ్యూటీఫుల్ లొకేషన్స్‌ను జ్యోతిక తన వీడియోలో చూపించింది. అంతే కాకుండా అక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తూ, ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తూ జ్యోతిక, సూర్యలు టైమ్ స్పెండ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ వీడియోలో ఇద్దరూ చాలా అన్యోన్యంగా కనిపిస్తున్నారు. కనుక ఇకపై అయినా మీడియాలో ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉన్న ప్రచారంకు తెర పడే అవకాశాలు ఉన్నాయి. జ్యోతిక ఆ పుకార్లకు చెక్ పెట్టేందుకు ఇలాంటి వీడియోలను షేర్ చేస్తున్నారా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సూర్య సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాదిలో ఇప్పటికే రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరచింది. సూర్య ప్రస్తుతం ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా ముగింపు దశకు చేరుకోవడంతో ఇదే ఏడాదిలో ఆ సినిమా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. లక్కీ భాస్కర్ తర్వాత మరో మంచి సబ్జెక్ట్‌తో ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి చేస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.