రెండు నగరాలు.. ఒకే జీవితం.. సూర్య- జ్యోతిక ముంబై- చెన్నై కనెక్షన్ అసలు కథ ఇదే!
చెన్నైతో ఉన్న అనుబంధాన్ని కంటిన్యూ చేస్తూనే ముంబైతోనూ స్ట్రాంగ్ కనెక్షన్‌ను కొనసాగిస్తున్న ఈ స్టార్ కపుల్ లైఫ్‌స్టైల్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.
సినిమా స్టార్ల జీవితం అంటే ఎప్పుడూ ఒకే నగరానికి పరిమితమై ఉండటం కష్టం. ముఖ్యంగా కెరీర్, కుటుంబం, పిల్లల చదువు, వ్యక్తిగత సంబంధాలు.. ఇలా ఒక్కో అవసరానికి ఒక్కో నగరం కీలకంగా మారుతుంది. ప్రస్తుతం హీరో సూర్య, నటి జ్యోతిక ఫ్యామిలీ విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చెన్నైతో ఉన్న అనుబంధాన్ని కంటిన్యూ చేస్తూనే ముంబైతోనూ స్ట్రాంగ్ కనెక్షన్‌ను కొనసాగిస్తున్న ఈ స్టార్ కపుల్ లైఫ్‌స్టైల్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.
సూర్య తాజాగా తన నివాసంపై నెలకొన్న సందేహాలకు క్లారిటీ ఇవ్వడంతో ఈ డిస్కషన్ మరోసారి తెరపైకి వచ్చింది. తాను చెన్నైలోనే ఉంటున్నానని, ముంబైకి మాత్రం తరచూ ప్రయాణిస్తున్నానని ఆయన చెప్పడం ద్వారా.. ముంబైకి వెళ్లడం అంటే చెన్నైని పూర్తిగా వదిలేయడం కాదనే విషయం స్పష్టమైంది. అయితే ఈ కుటుంబానికి ముంబై ఎందుకు అంత ముఖ్యమైంది? అన్నది చూస్తే, దాని వెనుక కేవలం సినిమా పనులు మాత్రమే లేవు. జ్యోతిక పుట్టి పెరిగింది ముంబైలోనే. ఆమె తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలనే ఫ్యామిలీ డెసిషన్ కూడా ముంబైతో వారి అనుబంధాన్ని పెంచింది. పిల్లల చదువు, ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపడం వంటి అంశాలు కూడా ఈ డెసిషన్ లో కీలకంగా మారినట్లు సూర్య గతంలో వెల్లడించారు.
మరోవైపు చెన్నై మాత్రం సూర్యకు కేవలం ఒక నగరం కాదు.. అతని సినీ ప్రయాణానికి, ఫ్యామిలీ లైఫ్ కు ఎన్నో ఏళ్లుగా బేస్‌గా ఉన్న ప్రాంతం. అందుకే ముంబైలో ఫ్యామిలీకి స్పెషల్ స్పేస్ ఏర్పడినా, చెన్నైతో ఉన్న బంధాన్ని మాత్రం వదులుకోలేదు. గతంలో సూర్య ముంబైలోని తమ చిన్న ఇంటి గురించి మాట్లాడుతూ, అక్కడి ప్రశాంతమైన కుటుంబ వాతావరణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఇక్కడే రెండు నగరాలు- రెండు అవసరాలు అనే కాన్సెప్ట్ ఆసక్తికరంగా మారుతోంది. చెన్నై సూర్య కెరీర్‌కు బేస్ అయితే.. ముంబై ఫ్యామిలీ బాండింగ్స్, పిల్లల లైఫ్, జ్యోతిక పర్సనల్ వరల్డ్ కు దగ్గరైన నగరంగా మారింది. అంటే ఇది ఒక నగరాన్ని వదిలి మరో నగరాన్ని ఎంచుకున్న కథ కాదు. అవసరానికి తగ్గట్టుగా రెండు నగరాలను తమ జీవితంలో భాగం చేసుకున్న ఫ్యామిలీ స్టోరీ. అందుకే సూర్య- జ్యోతిక విషయంలో ఎక్కడ ఉంటున్నారు? అనే ప్రశ్న కంటే.. రెండు నగరాలను ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అనేదే అసలు ఆసక్తికరమైన అంశంగా మారింది.