మూవీ చూశాకే అడ్వాన్స్.. కానీ సురేష్ బాబు ప్లాన్ ఏమైంది?

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు దగ్గుబాటి గురించి అందరికీ తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై వందలాది సినిమాలను నిర్మించారు, డిస్ట్రిబ్యూట్ చేశారు.;

Update: 2026-01-02 09:59 GMT

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు దగ్గుబాటి గురించి అందరికీ తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై వందలాది సినిమాలను నిర్మించారు, డిస్ట్రిబ్యూట్ చేశారు. బొబ్బిలి రాజా, ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా, నువ్వు లేక నేను లేను, తులసి, దృశ్యం వంటి అనేక విజయవంతమైన చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.

సినిమా నిర్మాణంతో పాటు స్టూడియో నిర్వహణ (రామానాయుడు స్టూడియోస్), డిజిటల్ పోస్ట్ ప్రొడక్షన్ రంగాల్లో ఆయన క్రియాశీలకంగా ఉన్నారు. అయితే కొంతకాలంగా సినిమాలను నిర్మించడం తగ్గించినప్పటికీ.. డిస్ట్రిబ్యూషన్ రంగంలో యాక్టివ్ గా ఉన్నారు. అది కూడా.. ఆచి తూచి చిత్రాలు కొనుగోలు చేస్తూ విడుదల చేస్తున్నారు.

అయితే రీసెంట్ గా ఏ సినిమాను కూడా రిలీజ్ చేయని సురేష్ బాబు.. తాజాగా సైక్ సిద్ధార్థ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. యంగ్ హీరో శ్రీ నందు లీడ్ రోల్ లో నటించిన ఆ మూవీ.. న్యూ ఇయర్ కానుకగా థియేటర్స్ లో విడుదల చేశారు. నిజానికి గత నెలలో రిలీజ్ కావాల్సిన ఆ సినిమా.. అఖండ 2 మూవీ వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

ఇప్పుడు ఎట్టకేలకు థియేటర్స్ లో విడుదలైన సైక్ సిద్ధార్థ్ మూవీ మిక్స్ డ్ రెస్పాన్స్ అందుకుంటోంది. సినిమా కోసం నందు బాగానే కష్టపడినప్పటికీ.. డైరెక్టర్ వరుణ్ రెడ్డి స్టోరీ మీద ఇంకాస్త కసరత్తులు చేసి ఉండాల్సిందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. టేకింగ్ బాగున్నా.. రైటింగ్ ఇంకా బలంగా ఉండాలని రివ్యూ ఇచ్చారు.

ఏదేమైనా సైక్ సిద్ధార్థ్ మూవీకి కిక్కు సరిపోలేదు. దీంతో సినిమా ఓపెనింగ్స్.. అనుకున్నంత స్థాయిలో లేవు. నందుకు కెరీర్ లో మంచి హిట్ గా నిలుస్తుందన్న అనుకున్న మూవీకి మిక్స్ డ్ రెస్పాన్స్ రావడంతో.. వసూళ్లు నిరాశజనకంగానే ఉన్నాయి. దీంతో సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ గా నిలుస్తుందో లేదో చెప్పలేం.

ఏదేమైనా సైక్ సిద్ధార్థ్ సినిమా విషయంలో సురేష్ బాబు ప్లాన్ ఫెయిల్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఆచితూచి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఆయన.. ఇప్పుడు సైక్ సిద్ధార్థ్ ను రిలీజ్ చేశారు. అది కూడా మూవీని ఓసారి మొత్తం చూసిన తర్వాత థియేట్రికల్ రైట్స్ కోసం అడ్వాన్స్ చెల్లించారు. ఆ విషయాన్ని ఆయనే చెప్పారు.

ప్రమోషన్స్ లో కూడా సందడి చేశారు సురేష్ బాబు. సినిమా చూశాక తనకు ఆసక్తిగా అనిపించిందని చెప్పారు. యువతను ఆకట్టుకుంటుందని విడుదలకు ముందు అంచనా వేశారు. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం సీన్ రివర్స్ అయింది. సినిమాలో కొన్ని సీన్స్ ఆకట్టుకున్నా.. ఓవరాల్ గా మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సురేష్ బాబు ప్లాన్ ఫెయిల్ అయినట్లే అని నెటిజన్లు అంటున్నారు.

Tags:    

Similar News