• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కృష్ణ ఒకే హీరోయిన్‌తో 45...

కృష్ణ ఒకే హీరోయిన్‌తో 45 సినిమాలు చేశారు తెలుసా..!

| సూపర్‌ స్టార్‌ కృష్ణ మన మధ్య లేకున్నా ఆయన చేసిన సినిమాలు ఎప్పటికీ ఆయన్ను గుర్తుకు తెస్తూనే ఉంటాయి.

By - Tupaki Desk
Update: 2025-06-02 10:09 GMT

సూపర్‌ స్టార్‌ కృష్ణ మన మధ్య లేకున్నా ఆయన చేసిన సినిమాలు ఎప్పటికీ ఆయన్ను గుర్తుకు తెస్తూనే ఉంటాయి. తెలుగు సినిమా పరిశ్రమకు సాంకేతిక పరిజ్ఞానం అందించడంలో, తెలుగు సినిమాను నెక్ట్స్ లెవల్‌కి తీసుకు వెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి సూపర్ స్టార్‌ కృష్ణ ఇప్పుడు మన మధ్య లేకపోవడం అనేది బాధాకరం అంటూ అభిమానులు ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. తాజాగా జయంతి సందర్భంగా అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా ఆయన జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. సుదీర్ఘ కాలం పాటు ఆయన చేసిన సినిమాల గురించి, ఆయన పాత్రల గురించి మాట్లాడుకున్నారు.

కృష్ణ ఎన్నో రకాల పాత్రలను చేశారు. తెలుగు సినిమా చరిత్రలో మరే హీరో పోషించనన్ని పాత్రలను కృష్ణ పోషించారని, మొదటి కౌబాయ్ సినిమా మొదలుకుని బాండ్‌ సినిమా వరకు కృష్ణ చేసిన తర్వాతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇతర హీరోలు చేశారు అంటూ అభిమానులు గొప్పగా, గౌరవంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక వందల కొద్ది సినిమాలు చేసిన కృష్ణ అత్యధికంగా సీనియర్‌ హీరోయిన్‌ జయప్రదతో నటించారు. పది కాదు.. ఇరవై కాదు ఏకంగా 45 సినిమాలను జయప్రదతో కృష్ణ కలిసి నటించారు. ఇలాంటి రికార్డ్‌ చాలా అరుదుగా మాత్రమే నమోదు అవుతూ ఉంటుంది. ఈ తరం హీరోలు ఎవరూ కూడా ఒకే హీరోయిన్‌తో కనీసం అయిదు.. పది సినిమాలు చేసే పరిస్థితి లేదు.

అప్పట్లో హీరోలు నెలకు ఒకటి, అంతకు మించి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో సఫలం అయ్యారు. చాలా స్పీడ్‌గా సినిమాలు చేయడంతో పాటు, వందల కొద్ది సినిమాల సంఖ్యను కలిగి ఉన్నారు. అందుకే వారు ఎక్కువ సినిమాలను ఒకే హీరోయిన్‌తో చేసే అవకాశం ఉండేది. అందుకే కృష్ణ ఏకంగా 45 సినిమాల్లో హీరోయిన్‌గా జయప్రద నటించారు. జయప్రద, కృష్ణ కాంబోలో వచ్చిన సింహాసనం, రామరాజ్యంలో భీమరాజు, మహాసంగ్రామం వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే వీరి కాంబోకి హిట్‌ పెయిర్‌గా పేరు దక్కింది. హీరోగా కృష్ణ ఇంకా పదుల సంఖ్యలో హీరోయిన్స్‌తో నటించారు.

కృష్ణ చనిపోయే వరకు నటిస్తూనే ఉన్నారు. ఆయన తన జీవితం మొత్తం సినిమాలకు అంకితం చేశారు. ఆయన మృతి తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు అనడంలో సందేహం లేదు. ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు సూపర్‌ స్టార్‌ ట్యాగ్‌ను దక్కించుకుని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు చేసిన మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అతి త్వరలోనే సినిమా నుంచి కీలక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని మేకర్స్ ద్వారా సమాచారం అందుతోంది.

Tags:    
  • Superstarkrishna 
  • Jayaprada 
  • Simhasanam 
  • 45movies 
  • Tollywood 
  • Movienews 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS