ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది - సునీల్

మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. విషయంలోకి వెళ్తే ప్రస్తుతం సునీల్ కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం కాటాలన్.

Update: 2026-05-27 06:57 GMT

ఒక్క పాత్ర పడితే చాలు కెరియర్ అమాంతం మారిపోతుంది అనే విషయాన్ని ఇప్పటికే ఎంతోమంది నటీనటులు నిరూపించారు. ఒకరి తర్వాత ఒకరు తమ జీవితంలో అనూహ్యంగా వచ్చే పాత్రలతో తమ కెరియర్ నే మార్చుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ సీనియర్ కమెడియన్ సునీల్ కూడా ఒకరు. ఒకప్పుడు తన కామెడీతో ప్రేక్షకులను అలరించిన ఈయన, ఆ తర్వాత సిక్స్ ప్యాక్ బాడీతో హీరోగా సినిమాలు చేసి మెప్పించారు కూడా.. అలాంటి ఈయన ఈ మధ్యకాలంలో విలన్ గా పలు పాత్రలు పోషిస్తూ ఊహించని ఇమేజ్ దక్కించుకుంటున్నారు.

ఇక ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా భాషలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన సునీల్ తాజాగా ఒక సినిమా కార్యక్రమంలో పాల్గొని, ఆ సినిమా తర్వాత తన కెరియర్, తన జీవితం పూర్తిగా మారిపోయాయి అంటూ తెలిపారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. విషయంలోకి వెళ్తే ప్రస్తుతం సునీల్ కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం కాటాలన్.

పాల్ జార్జ్ రచనా దర్శకత్వంలో రాబోతున్న మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై షరీఫ్ ముహమ్మద్ నిర్మించిన ఈ చిత్రంలో ఆంటోనీ వర్గీస్, జగదీష్ ,కబీర్ దుహన్ సింగ్, సునీల్, దుషారా విజయన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మే 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ఒక ఈవెంట్ నిర్వహించగా.. అందులో పాల్గొన్న సునీల్ పలు విషయాలు పంచుకున్నారు.

సునీల్ మాట్లాడుతూ.." పుష్ప సినిమా తర్వాత నా లైఫ్ ఒక సర్ప్రైజింగ్ మోడ్ లోకి వెళ్లిపోయింది. అన్ని భాషల నుంచి నాకు అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏ భాష నుంచి ఎప్పుడు ఎవరి సినిమా వస్తుందో కూడా నాకు తెలియడం లేదు. ఎలాంటి క్యారెక్టర్ వస్తుందో కూడా నాకు తెలియదు. జైలర్ సినిమా చూశాక కేరళ సెట్ కు వెళ్తే తమిళ్లో సీన్ పేపర్ ఇచ్చేస్తున్నారు.

అలా అన్ని భాషల నుండి నాకు అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ కాటాలన్ సినిమాలో నా పాత్ర పేరు మారి . కథలో చాలా కీలకంగా ఉంటుంది. ఎంతో సంతృప్తిని ఇచ్చిన పాత్ర ఇది. ఇప్పటివరకు ఇలాంటి వెరైటీ పాత్రను నేను ఎప్పుడూ చేయలేదు.. ముఖ్యంగా ఈ కథ విన్నప్పుడు నేను ఎంతో సర్ప్రైజ్ అయ్యాను. పైగా ఇందులో ఒక పాట కూడా చేశాను. కాటాలన్ జర్నీ నాకు ఎంతో ప్రత్యేకం "అంటూ సునీల్ తెలిపారు.



Tags:    

Similar News