కుమార్తె ప్రసవంపై స్టార్ హీరో వ్యాఖ్యలకు సీరియస్
తన కుమార్తె సిజేరియన్ (సి- సెక్షన్) కాకుండా సహజంగా ప్రసవించాలని నిర్ణయించుకుందని బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి ప్రకటించాడు.;
తన కుమార్తె సిజేరియన్ (సి- సెక్షన్) కాకుండా సహజంగా ప్రసవించాలని నిర్ణయించుకుందని బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి ప్రకటించాడు. అయితే అతడి ప్రకటన నెటిజనులకు రుచించలేదు. యోనికి కుట్లు వేసి వాటిని విప్పితేనే సుఖంగా ప్రసవించినట్టా? అని ఒక నెటిజన్ నేరుగా సునీల్ శెట్టిని టార్గెట్ చేసారు.
అయితే నెటిజనుల ప్రతిస్పందనలకు సునీల్ శెట్టి సమాధానమిచ్చారు. సిజేరియన్ ద్వారా బిడ్డను కనడం వల్ల కలిగే సౌకర్యాన్ని అందరూ కోరుకునే ఈ ప్రపంచంలో ఆథియా అలా చేయకూడదని అనుకుంది. ఆసుపత్రిలోని ప్రతి నర్సు , శిశువైద్యుడు ఆథియా మొత్తం ప్రసవ ప్రక్రియను ఎలా ఫేస్ చేసిందో చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. అది నన్ను తండ్రిగా హృదయాన్ని తాకింది. ప్రకృతి సిద్ధంగా బిడ్డను ప్రసవించేందుకు ఆథియా సిద్ధమైంది! అని అనుకున్నాను. అతియా అలా చేయడానికి చాలా బలంగా ఉంది.. ఒక్కసారి కూడా ఆమె ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కోలేదు. ముఖం చిట్లించుకోలేదు.. అలసిపోయానని అనలేదు..`` అని సునీల్ శెట్టి అన్నారు.
ఆథియా- కెఎల్ రాహుల్ ఈ సంవత్సరం మార్చి 24న తమ మొదటి బిడ్డ, కుమార్తె ఎవారాను స్వాగతించారు. వారు జనవరి 2023లో వివాహం చేసుకున్నారు. ఈ జంట అన్యోన్య దాంపత్యం అందరికీ ఆదర్శం. ఆథియా- కెఎల్ మధ్య అన్యోన్యత జంట గోల్స్ ని నిర్ధేశిస్తోంది. పెళ్లయిన తర్వాత ఆథియా పూర్తిగా నటనను విరమించి వ్యక్తిగత కుటుంబ జీవనానికే సమయం కేటాయిస్తోంది.