సైకిల్ పై అపర్ణతో సందీప్.. నవ్వుతూ ఎటు వెళ్తున్నారో?

త్వరలో పలు చిత్రాలతో తెలుగు సినీ ప్రియులను అలరించనున్నారు సందీప్ కిషన్.

Update: 2024-05-22 20:06 GMT

వినూత్న కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే టాలీవుడ్ యంగ్ హీరోల్లో సందీప్ కిషన్ కచ్చితంగా ముందు వరుసలో ఉంటారు. తన సినిమాలతో సూపర్ హిట్లు కొట్టిన సందీప్ కిషన్.. కొన్నాళ్లపాటు వరుసగా ఫ్లాప్స్ అందుకున్నారు. ఇటీవల ఊరు పేరు భైరవకోన సినిమాతో మంచి హిట్ అందుకుని మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. త్వరలో పలు చిత్రాలతో తెలుగు సినీ ప్రియులను అలరించనున్నారు సందీప్ కిషన్.


ప్రస్తుతం ఆయన చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. మాయావన్ తో పాటు ధనుష్ రాయన్ మూవీలో నటిస్తున్నారు. త్వరలో ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో చేయనున్న సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. రాయన్ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో సందీప్ కిషన్ లీడ్ రోల్ లో కనిపించనున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సందీప్ కిషన్ ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ అందుకుంది. అందులో సందీప్.. రగ్డ్ లుక్ లో అలరించారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అందులో సందీప్ కిషన్ సైకిల్ తొక్కుతూ కనిపించారు. ఆయన ముందు హీరోయిన్ అపర్ణ బాలమురళి కూర్చుని ఉంది. ఇద్దరూ చక్కగా నవ్వుతూ హ్యాపీ మూడ్ లో ఉన్నట్టు చూపించారు మేకర్స్.

సినిమాలో వీరిద్దరూ జోడీగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అపర్ణ చీరకట్టులో చూడముచ్చటగా ఉంది. సందీప్ కూడా విలేజ్ లుక్ లో బాగున్నారు. బ్యాక్ గ్రౌండ్ అంతా నేచురల్ గా ఉంటూ పోస్టర్ ఆకట్టుకుంటోంది. అయితే ఈ పోస్టర్ ను విడుదల చేస్తూ.. సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. సందీప్, అపర్ణ మధ్య సాగే మెలోడీ సాంగ్ మే 24వ తేదీన రివీల్ చేయనున్నట్లు చెప్పారు.

Read more!

ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఆ మెలోడీ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇక రాయన్ లో ఎస్‌ జే సూర్య, సెల్వ రాఘవన్, ధుషార్ విజయన్ తో పాటు మరికొందరు నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 13వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులో సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ ఎల్ పీ రిలీజ్ చేయనుంది. మరి ఇప్పటికే మంచి ఫామ్ లో ఉన్న సందీప్ కిషన్.. రాయన్ మూవీతో ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News