ఈ వారం హంగామా ఆ సినిమాలదే
కానీ ఈసారి సమ్మర్ కు టాలీవుడ్ నుంచి పెద్దగా స్టార్ హీరోల సినిమాలేమీ లేవు.;
సినిమాలకు బెస్ట్ సీజన్ గా చెప్పుకునే సమ్మర్ వచ్చేసింది. మామూలుగా ప్రతీసారి సమ్మర్ కు పెద్ద సినిమాలు హడావిడి చేస్తుంటాయి. కానీ ఈసారి సమ్మర్ కు టాలీవుడ్ నుంచి పెద్దగా స్టార్ హీరోల సినిమాలేమీ లేవు. ముందుగా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో పలు చిన్న సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. ఏప్రిల్ 4న రానున్న సినిమాలు, వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.
అందులో మొదటిగా చెప్పుకోవాల్సింది నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తోన్న ఆదిత్య369. గతం, భవిష్యత్తును మిళితం చేస్తూ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 4న రీరిలీజ్ కానుంది. 1991లో రిలీజైన ఈ మూవీ రీరిలీజ్ అవుతుండటంతో ఇప్పుడు అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఏప్రిల్ 4న ఆదిత్య 369 పలు థియేటర్లలో రిలీజ్ కానుంది.
దీంతో పాటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొడుకు ఎస్పీ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న ఎల్‌వైఎఫ్: లవ్ యువర్ ఫాదర్ సినిమా కూడా ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కేతరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తండ్రీ కొడుకుల అనుబంధంతో పాటూ మైథలాజికల్ టచ్ తో రానున్నట్టు ఆల్రెడీ రిలీజైన కంటెంట్ చూస్తుంటే అర్థమవుతోంది.
రామ్ గోపాల్ వర్మ మూల కథతో రూపొందిన శారీ కూడా ఏప్రిల్ 4న రిలీజ్ కానుంది. గిరికృష్ణ కమల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించగా, కొన్నిసార్లు పర్సనల్ విషయాల్ని షేర్ చేసుకున్న తర్వాత ఎదురయ్యే ఇబ్బందుల నేపథ్యంలో రూపొందిన శారీ సినిమా చూశాక ప్రతీ అమ్మాయి జాగ్రత్త పడుతుందని రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా గురించి చెప్పి హైప్ ఇచ్చారు.
వీటితో పాటూ పొలిమేర ఫ్రాంచైజ్ సినిమాలతో డైరెక్టర్ గా తనదైన ముద్ర వేసుకున్న అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో వస్తోన్న తాజా సినిమా 28 డిగ్రీస్ సెల్సియస్ కూడా ఏప్రిల్ 4 వ తేదీనే రిలీజవుతోంది. నవీన్ చంద్ర హీరోగా రూపొందిన ఈ సినిమా ఓ ఇంటి వల్ల హీరో లైఫ్ లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఎదురవుతాయనే అంశంతో రూపొందింది.
1966-1990 నేపథ్యంలో ఫాంటసీ డ్రామాగా రూపొందిన వృషభ ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో జీవన్, అలేఖ్య జంటగా నటిస్తుండగా అశ్విన్ కామరాజ్ కొప్పల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆధ్యాత్మకంగా ఉంటూనే మనుషులకు, పశువులకు మధ్య ఉండే బాండింగ్ ను ఇందులో చూపించనున్నట్టు చిత్ర యూనిట్ చెప్తోంది.