• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తేజ్ కోసం ఇద్దరు స్టార్...

తేజ్ కోసం ఇద్దరు స్టార్ యాంకర్స్.. ప్లాన్ రివర్స్ కొట్టేసింది..!

| మెగా మేనల్లుడు సాయి తేజ్ లాస్ట్ ఇయర్ బ్రో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

By - Tupaki Desk
Update: 2024-09-13 21:30 GMT

మెగా మేనల్లుడు సాయి తేజ్ లాస్ట్ ఇయర్ బ్రో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంతకుముందు విరూపాక్షతో హిట్ అందుకున్న సాయి తేజ్ బ్రో తర్వాత ఈమధ్యనే ఒక సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. కెరీర్ విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్న సాయి తేజ్ కథలను కూడా చాలా ఫోకస్ తో ఎంపిక చేసుకుంటున్నాడు. ఐతే సాయి తేజ్ కోసం ఒక స్టార్ యాంకర్ ఒక సాంగ్ పాడిన విషయం ఎంతమందికి తెలుసు. అసలు కొంతమందికి ఇది జరిగిందన్నది కూడా తెలియకపోవచ్చు.

సాయి తేజ్ నటించిన ఒక సినిమాలో స్టార్ యాంకర్ పాట పాడగా మరో యాంకర్ ఆ సాంగ్ కి స్టెప్పులేసింది. ఇంతకీ ఏంటా పాట.. ఏ సినిమాలో ఇది జరిగింది అంటే. సాయి తేజ్ నటించిన విన్నర్ సినిమాలో సూయ సూయ సాంగ్ ని స్టార్ యాంకర్ సుమ ఆలపించారు. ఆ సాంగ్ కి అనసూయ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. సాయి ధరం తేజ్ కోసమే సుమ ఆ పాట పాడినట్టు తెలుస్తుంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా 2017 లో రిలీజైంది.

సాఇ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో సూయ సూయ సాంగ్ ని సుమ పాడగా అనసూయ స్క్రీన్ పై మెరుపులు చిందించారు. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా రిజల్ట్ అంతగా మెప్పించలేదు కానీ సాంగ్స్ మాత్రం ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సాయి తేజ్ సినిమాలోని ఒక పాటకి ఇద్దరు స్టార్ యాంకర్స్ పనిచేయడం క్రేజీగా అనిపించింది. సాయి తేజ్ నెక్స్ట్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

యాంకర్ సుమ సింగింగ్ టాలెంట్ ఈ పాటతో తెలిసింది. ఐతే ఆ తర్వాత ఆమె మళ్లీ ట్రై చేయలేదు. అనసూయ కూడా స్పెషల్ సాంగ్స్ కన్నా సినిమాకు ఇంపార్టెంట్ అనిపించే డిఫరెంట్ రోల్స్ చేస్తూ మెప్పిస్తుంది. సుమ లీడ్ రోల్ లో జయమ్మ పంచాయతీ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా కోసం సుమ బాగా కష్టపడినా లాభం లేకుండా పోయింది. సుమ మాత్రం అప్పటికీ ఇప్పటికీ స్టార్ సినిమాల ప్రీ ఈవెంట్స్ తో బిజీ బిజీగా ఉంటుంది. మరోపక్క బుల్లితెర మీద రకరకాల షోస్ కూడా చేస్తుంది. సాయి తేజ్ నెక్స్ట్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

Tags:    
  • Anchorsuma 
  • Suyasuyasong 
  • Anasuya 
  • Winnermovie 
  • Saidharamtej 
  • Tollywood 
  • Rakulpreetsingh 
  • Filmindustry 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS