• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సుకుమార్ ఎంత బిజీ అంటే..

సుకుమార్ ఎంత బిజీ అంటే..

| ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ కూడా యూనివర్సల్ కథలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు

By - Tupaki Desk
Update: 2024-08-06 04:59 GMT

ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ కూడా యూనివర్సల్ కథలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఈ మూవీస్ అన్ని కూడా వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. నిర్మాతలు కూడా మన స్టార్ హీరోల మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. దర్శకులు కూడా పాన్ ఇండియా సినిమాలు అనేసరికి ఎక్కువ కేర్ తీసుకొని చేస్తున్నారు. యూనివర్సల్ గా ఆడియన్స్ కి రీచ్ అయ్యే కథలని చెప్పాలని అనుకుంటున్నారు. అది కూడా గ్రాండ్ స్కేల్ పై ఆవిష్కరించడానికి చాలా డీటెయిలింగ్ గా వర్క్ చేస్తున్నారు.

ఈ కారణంగా షూటింగ్ కోసం చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. సుకుమార్ లాంటి పెర్ఫెక్షనిస్ట్ లు అయితే అవుట్ ఫుట్ విషయంలో ఎక్కడా రాజీపడరు. అందుకే టైం ఎక్కువ తీసుకున్న బెస్ట్ క్వాలిటీ సినిమాలు వారి నుంచి వస్తాయి. ఇప్పుడు పుష్ప ది రూల్ విషయంలో కూడా అదే జరుగుతోంది. పుష్ప మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా రెడీ అవుతోన్న పుష్ప ది రూల్ పైన సుకుమార్ ఎక్కువ ఫోకస్ పెట్టారు.

ఈ సినిమా కథని లార్జర్ దెన్ లైఫ్ అనేలా సిల్వర్ స్క్రీన్ పై సుకుమార్ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. కచ్చితంగా పుష్ప ది రూల్ తో దేశం మొత్తం తిరిగి చూసేలా చేసుకోవాలని బలంగా అనుకుంటున్నారు. గత మూడేళ్ళ నుంచి ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. నిజానికి ఆగష్టు 15న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో డిసెంబర్ 6కి వాయిదా వేశారు.

ప్రస్తుతం సుకుమార్ ఓ వైపు ఎడిటింగ్ కంప్లీట్ చేస్తూనే పెండింగ్ షూట్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. సుక్కు అలాగే అతని డైరెక్షన్ డిపార్ట్మెంట్ రోజుకు 16 గంటల నుంచి 18 గంటల వరకు వర్క్ చేస్తోందట. షూటింగ్ ముగిసిన అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయట. పుష్ప 1 సమయంలో సుక్కు ప్రమోషన్ లో పెద్దగా కనిపించలేదు. అయితే ఈసారి అనుకున్న టైమ్ కు వర్క్ ఫినిష్ చేసి తను కూడా ప్రమోషన్స్ చేయాలని అనుకుంటున్నాడు.

సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య ఈ మూవీ షూటింగ్ విషయంలో గ్యాప్ వచ్చిందనే ప్రచారం ఇటీవల గట్టిగానే నడిచింది. బన్నీ పుష్పరాజ్ లుక్ తీసేసి ఫ్యామిలీతో లండన్ వెకేషన్ కి వెళ్లిపోయారు. అలాగే సుకుమార్ కూడా తన కూతురు స్టడీస్ కోసం యూఎస్ వెళ్లారు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు నడుస్తున్నాయనే టాక్ విస్తృతంగా నడిచింది. వాటికి బన్నీ, సుకుమార్ సన్నిహితులు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

ముందుగా అల్లు అర్జున్ లేని సీక్వెన్స్ ని సుకుమార్ ఫినిష్ చేశారంట. తాజాగా బన్నీ కూడా షూటింగ్ సెట్ లో జాయిన్ అయ్యారంట. ఆయన మీద క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత ఒక సాంగ్ మాత్రమే బన్నీ చేయాల్సి ఉంటుందంట. అతని పోర్షన్ ఆల్ మోస్ట్ అయిపోయినట్లే అనే మాట వినిపిస్తోంది. అయితే తీసేసిన గెడ్డాన్ని మేకప్ తో మ్యానేజ్ చేయబోతున్నారని సమాచారం.

Tags:    
  • Sukumar 
  • Pushpa2 
  • Alluarjun 
  • Rashmika 
  • Pushpa2movie 
  • Pushpa2shooting 
  • Tollywood 
  • Sukumarpushpa2 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS