జాన్వీకపూర్ లా కనకవతికి ఛాన్సుందా?
తాజాగా కన్నడ నటి రుక్మిణీ వసంత్ కూడా జాన్వాలాగే టాలీవుడ్ లో ఛాన్సులు అందుకుంటుందా? అన్న చర్చ మొదలైంది.;
అతిలోక సుందరి శ్రీదేవి తనయగా జాన్వీకపూర్ టాలీవుడ్ ఏ రేంజ్ లో ఎంట్రీ ఇచ్చిందో తెలిసిందే. ముందుగా తెలుగులో లాంచ్ అవుతుందా? హిందీలో లాంచ్ అవుతుందా? అన్న దానిపై పెద్ద డిబేట్ జరిగింది. చివరికి బాలీవుడ్ లోనే ఎంట్రీ ఇచ్చింది. అనంతరం `దేవర`తో టాలీవుడ్ లోనూ ప్రవేశించింది. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడీగా నటించింది. తంగ పాత్రలో ఏదో మ్యాజిక్ చేస్తుందనుకుంటే? మొదటి భాగంలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధన్యత ఇవ్వలేదు. కేవలం కొన్ని సన్నివేశాలకు, పాటలకు, గ్లామర్ వరకే పరిమితమైంది.
కానీ తదుపరి ఛాన్స్ అందుకోవడంలో సక్సెస్ తో పని లేకుండానే అవకాశం ఒడిసి పట్టుకుంది. `దేవర` సెట్స్ లో ఉండగానే? బుచ్చిబాబు `పెద్ది` సినిమాకు ఎంపిక చేసాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటిస్తే జాన్వీ మాత్రమే నటించాలని ఎంతో మంది నటీమణులున్నా? జాన్వీనే ఏరికోరి మరీ ఎంపిక చేసాడు. `దేవర` ఇవ్వని సక్సెస్ `పెద్ది` అందిస్తుందని జాన్వీ ఎంతో కాన్పిడెంట్ గా ఉంది. అలాగే ఈ సినిమా రిజల్ట్ తో పనిలేకుండా కొత్త అవకాశాలు క్యూ కడుతున్నాయి. కానీ జాన్వీ మాత్రం ఆచితూచి అడుగులేస్తుంది.
తాజాగా కన్నడ నటి రుక్మిణీ వసంత్ కూడా జాన్వాలాగే టాలీవుడ్ లో ఛాన్సులు అందుకుంటుందా? అన్న చర్చ మొదలైంది. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న భారీ యాక్షన్ థ్రిల్లర్ తో రుక్మిణీ వసంత్ టాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. కన్నడ అనువాద చిత్రాలతో అమ్మడు సుపరిచితమైనా తెలుగులో తొలి చిత్రం ఇదే. దీంతో జాన్వీ తరహాలో అదే లైనప్ లో ఛాన్సులు అందుకుంటుందా? అన్న గెస్సింగ్ తెరపైకి వస్తోంది. అలా చూస్తే రుక్మిణికి కూడా వెంటనే రామ్ చరణ్ తో ఛాన్స్ రావాలి. రామ్ చరణ్ 17వ చిత్రం సుకుమార్ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే.
`పెద్ది` నుంచి రిలీవ్ అవ్వగానే ఈ సినిమా పట్టాలెక్కుతుంది. ఇందులో హీరోయిన్ ఇంకా ఎంపిక కాలేదు. ఈ నేపథ్యంలో ఆ ఛాన్స్ రుక్మిణీ వసంత్ కు లేకపోలేదనే చర్చ నెట్టింట మొదలైంది. మరి ఆ ఛాన్స్ సుకుమార్ తీసుకుంటాడా? లేదా? అన్నది చూడాలి. సుకుమార్ శిష్యుడిగా బుచ్చిబాబు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. శిష్యుడు అంటే సుకుమార్ కి ఎంతో ఇష్టం. తన ప్రియ శిష్యుడిగా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో ఎదుగుతున్నాడు. అలాగే రుక్మిణీ వసంత్ ...జాన్వీకపూర్ కంటే ఉత్తమంగానూ రాణిస్తోంది. `కాంతార చాప్టర్ వన్` తో పాన్ ఇండియా లోనూ ఫేమస్ అయింది. కనకవతి పాత్రతో ఇండియానే షేక్ చేసింది. అందం, అభినయం అదనంగా కలిసొచ్చిన అంశాలు. సుకుమార్ ఛాన్స్ ఇస్తే గనుక కనకవతి రేంజ్ రెట్టింపు అవుతుంది.