సుక్కు యూనివర్స్.. పుష్ప రాజ్ తో చరణ్ కలిస్తే..?
ఇప్పుడు ప్రతి ఒక్కరు సినిమాటిక్ యూనివర్స్ తో హంగామా చేస్తున్నారు. అలాంటిది ఒకటి మన పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కూడా చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.;
ఇప్పుడు ప్రతి ఒక్కరు సినిమాటిక్ యూనివర్స్ తో హంగామా చేస్తున్నారు. అలాంటిది ఒకటి మన పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కూడా చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ చేసిన పుష్ప సినిమా చేసిన అద్భుతాలు తెలిసిందే. నేషనల్ లెవెల్ లో పుష్ప రాజ్ పూనకాలు బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. సుకుమార్ కూడా ఈ రేంజ్ సక్సెస్ ని అసలు ఊహించలేదు. ఇక పుష్ప 2 తోనే ముగిస్తాడు అనుకున్న సుకుమార్ పార్ట్ 3 కూడా పెట్టాడు. పుష్ప 3 రాంపేజ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది.
చరణ్ తో రంగస్థలం.. అల్లు అర్జున్ పుష్ప..
ఐతే పుష్ప 3 కన్నా ముందు రామ్ చరణ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు సుకుమార్. చరణ్ తో రంగస్థలం తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి ఈ ప్రాజెక్ట్ పై నెక్స్ట్ లెవెల్ బజ్ ఉంది. ఐతే చరణ్ తో సుకుమార్ చేసే సినిమా పుష్ప యూనివర్స్ లో చేస్తే ఎలా ఉంటుంది అనే డిస్కషన్ నెటిజెన్స్ లో మొదలైంది. పుష్ప యూనివర్స్ అందులోనూ చరణ్ జస్ట్ ఇమాజిన్ చేస్తేనే ఒక రేంజ్ హై ఇస్తుంది. ఈ ఆలోచన సుకుమార్ కి వస్తే ఎలా ఉంటుందన్న చర్చ నడుస్తుంది.
అటు ఓ పక్క పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ ని మ్యాచ్ చేసేలా చరణ్ క్యారెక్టర్ రాసుకుని చరణ్ సినిమా చివర్లో పుష్ప రాంపేజ్ కి లీడ్ ఇస్తే పుష్ప 3లో అల్లు అర్జున్, చరణ్ నటించేలా కథ రాస్తే మాత్రం ఒక్క రికార్డ్ కూడా వదలకుండా రచ్చ రచ్చ చేస్తారు. అటు గ్లోబల్, ఇటు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ కాంబో సినిమా అంటే ఒక రేంజ్ హైప్ తెస్తారు.
చరణ్, అల్లు అర్జున్ తో సుకుమార్..
RRR తో చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ నే సెట్ చేశాడు రాజమౌళి. అలాంటిది సుకుమార్ తలచుకుంటే చరణ్, అల్లు అర్జున్ ని కలపి సినిమా తీయలేడా అన్న డిస్కషన్ మొదలైంది. ఏది ఏమైనా ఇది జస్ట్ ఒక రూమర్ లా అనిపిస్తున్నా కూడా ఇలా జరిగితే మాత్రం వెండితెర మీద అల్లు అర్జున్, చరణ్ విధ్వంసం ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు. సుకుమార్ టీం లో ఎవరైనా ఇలాంటి ఒక థాట్ ని ఆయన ముందు ఉంచితే తప్పకుండా ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే అని చెప్పొచ్చు.
పుష్ప యూనివర్స్ లోకి చరణ్ వస్తాడా.. చరణ్ తో యూనివర్స్ స్టార్ట్ చేసి అందులో పుష్పని తెస్తాడా అన్నది తెలియదు కానీ సుకుమార్ ఇలా తన సినిమాటిక్ యూనివర్స్ ని ప్లాన్ చేస్తే మాత్రం బాక్సాఫీస్ షేక్ అవ్వడం కాదు రికార్డుల మోత మోగిపోతుందని చెప్పొచ్చు.