• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సుకుమార్‌ 'స్పెషల్'...

సుకుమార్‌ 'స్పెషల్' సాంగ్స్.. స్టెప్పులేసిన 'ఐటమ్‌' బాంబ్స్

| ఇలా సుకుమార్‌ సినిమాలలో 'స్పెషల్‌ సాంగ్స్‌' ఎంతో స్పెషల్ గా ఉంటాయి.. ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందులో ఆడిపాడే ఐటమ్ గాళ్స్ కూడా అంతే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-11-12 04:28 GMT

జీనియస్ డైరెక్టర్ సుకుమార్‌ ఏ సినిమా తీసినా కమర్షియల్ మీటర్ లోనే ఉండేలా చూసుకుంటారు. లెక్కలన్నీ వేసుకొని అన్ని రకాల ఎలిమెంట్స్ ను కథలో జోడించడానికి ప్రయత్నిస్తుంటారు. ఇందులో భాగంగా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే ఓ ఐటెం సాంగ్ పెడుతూ వస్తున్నారు. వాటికి ప్రజాదరణ దక్కడంతో, దాన్నే సెంటిమెంటుగా భావిస్తున్నారు. ఒక్క 'నాన్నకు ప్రేమతో' మినహా, తాను డైరెక్ట్ చేసిన మిగతా సినిమాలన్నిటిలోనూ స్పెషల్ సాంగ్ ఉంటుంది. వీటన్నిటికీ దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ సమకూర్చడం గమనార్హం.

 

 

సుకుమార్ డైరెక్టర్ గా పరిచయమైన సినిమా "ఆర్య". అల్లు అర్జున్హీరోగా నటించిన ఈ చిత్రంలో, 'అ అంటే అమలాపురం' అనే ప్రత్యేక గీతం ఉంటుంది. ఇందులో తెలుగమ్మాయి అభినయశ్రీ ఐటమ్ గర్ల్ గా ఆడిపాడింది. అప్పటికే ఆమె కొన్ని తెలుగు తమిళ కన్నడ భాషల్లో స్పెషల్ సాంగ్స్ తో పాపులారిటీ సంపాదించుకోవడంతో.. ఆర్యలో బన్నీ సరసన డ్యాన్స్ చేయడానికి ఎంపిక చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఊర్ల పేర్లతో కూడిన ఈ మాస్ బీట్, అప్పట్లో యువతరాన్ని ఓ ఊపు ఊపేసింది.

 

 

రామ్ పోతినేని హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "జగడం". దీంట్లో '36-24-36' అంటూ నంబర్స్ తో సాగే స్పెషల్ సాంగ్ క్రియేట్ చేశారు. ఈ పాటలో మోనాలిసా, మధుశాలిని వంటి ఇద్దరు ముద్దుగుమ్మలు ఐటమ్ బాంబ్స్ గా కనిపించారు. అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన రెండో సినిమా "ఆర్య 2''. ఇందులోనూ 'రింగ రింగా' అనే మాస్ ఐటమ్ సాంగ్ పెట్టారు. లిరిక్స్ మీద వివాదం చెలరేగడంతో కొన్ని చోట్ల మార్చారు. ఈ పాటలో ఎరినా ఆండ్రియానా ఐటమ్ గర్ల్ గా బన్నీతో పోటాపోటీగా డ్యాన్స్ చేసింది.

 

 

అక్కినేని నాగచైతన్య, సుకుమార్ కాంబోలో రూపొందిన సినిమా "100% లవ్". ఈ మూవీలోని 'డియాలో డియాలా' అనే ఐటెం సాంగ్ ఎంత పెద్ద హిట్టయిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఇందులో మరియం జకారియా, మేఘా నాయుడు ఐటమ్ భామలుగా చైతూ, తమన్నాలతో కలిసి స్టెప్పులేసారు. ఇదే క్రమంలో మహేష్ బాబుతో తీసిన ''1 నేనొక్కడినే'' చిత్రంలోనూ స్పెషల్ సాంగ్ పెట్టారు సుక్కూ. 'లండన్ బాబూ' అంటూ సాగే ఈ పాటలో సోఫీ చౌదరి ఐటమ్ గర్ల్ గా కనిపించింది. సినిమా ప్లాప్ అయినా ఈ పాట పెద్ద సక్సెస్ అయింది.

 

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా "రంగస్థలం". ఈ చిత్రంలోని 'జిల్ జిల్ జిగేల్‌ రాణి' అనే ప్రత్యేక గీతంలో పూజాహెగ్డే స్పెషల్ గా డ్యాన్స్ చేసింది. అప్పటికే 'డీజే' సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన పూజా.. ఐటమ్ బాంబ్ గా చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. ఇక అల్లు అర్జున్, సుక్కు కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ "పుష్ప: ది రైజ్"లో 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా' పాట పాన్ ఇండియాని ఊపేసింది. ఇందులో సమంత రూత్ ప్రభు ఐటెం భామగా నటించింది. అప్పటికే స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న సామ్.. ఇలాంటి ఐటమ్ సాంగ్ చేయడంతో అందరూ అవాక్కయ్యారు.

 

 

ఇలా సుకుమార్‌ సినిమాలలో 'స్పెషల్‌ సాంగ్స్‌' ఎంతో స్పెషల్ గా ఉంటాయి.. ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందులో ఆడిపాడే ఐటమ్ గాళ్స్ కూడా అంతే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇప్పుడు "పుష్ప 2: ది రూల్" సినిమాలోనూ 'కిస్సిక్‌' అనే ఐటమ్ నంబర్ ఉంది. ఇందులో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఐటమ్ బాంబ్ గా కనిపించనుంది. ఇప్పటికే 'కుర్చీ మడతపెట్టి' లాంటి పాటల్లో తన డ్యాన్స్ ఎలా ఉంటుందో చూపించిన ఈ బ్యూటీ.. ఈసారి అల్లు అర్జున్ తో కలిసి రెచ్చిపోయి స్టెప్పులేసినట్లుగా ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకూ సుకుమార్ తీసిన స్పెషల్ సాంగ్స్ కు ఏమాత్రం తగ్గకుండా, అంతకుమించి ఉండేలా ఈ పాటను చిత్రీకరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Tags:    
  • Sukmar 
  • Specialsongs 
  • Arya 
  • Jagadam 
  • Arya2 
  • 100%love 
  • 1Nenukodine 
  • Rangasthalam 
  • Pushpatherule 
  • Pushpa2 
  • Samantha 
  • Sreeleela 
  • Sophiechoduhry 
  • Poojahegde 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS