గ్లామర్ వరల్డ్‌లో నాణేనికి రెండో వైపు
సినీపరిశ్రమలో ప్రముఖులతో నటీమణుల సంబంధాల గురించి ఎప్పుడూ గాసిప్స్ షికార్ చేస్తూనే ఉంటాయి.;
సినీపరిశ్రమలో ప్రముఖులతో నటీమణుల సంబంధాల గురించి ఎప్పుడూ గాసిప్స్ షికార్ చేస్తూనే ఉంటాయి. దేశంలోని అతి పెద్ద పరిశ్రమ బాలీవుడ్ లో ఓ ఇద్దరు భామల గురించి ఏడాది కాలంగా విస్త్రతంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరూ 200 కోట్ల స్కామ్ తో ముడిపడిన మోసగాడు సుకేష్ చంద్రశేఖర్ తో సన్నిహితంగా మెలగడమే దీనికి కారణం. సుకేష్ చంద్రశేఖర్ మాటల గారడీకి వల్లో పడిన కథానాయికల కథలు నిజంగా ప్రపంచానికి షాకిచ్చాయి. అయితే రంగుల ప్రపంచంలో ఇలా జరగడం కొత్తేమీ కాదు.. కెరీర్ కోసం పాకులాటలో ఇక్కడ పరిచయమైన ఎవరో ఒక బిగ్ షాట్ పై ఆధారపడటం చూస్తున్నదే.
ముఖ్యంగా జాక్విలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి గురించి ఎక్కువగా చర్చ సాగింది. నోరాతో పోలిస్తే జాక్విలిన్ సుకేష్ నుంచి ఎక్కువ కానుకలు అందుకుంది. కేవలం జాక్విలిన్ మాత్రమే కాదు.. ఆమె ఫ్యామిలీ సభ్యులు కూడా అతడి నుంచి కానుకలు అందుకోవడం ఆసక్తికరం. అయితే నోరా ఫతేహి తాను సుకేష్ నుంచి ఎలాంటి కానుకలు అందుకోలేదని కొట్టి పారేయగా, అతడు మాత్రం నోరాకు డబ్బు, ఖరీదైన బెంజ్ ని కొని ఇచ్చానని చెప్పాడు. నోరా, జాక్విలిన్ తో తన సంబంధాలను అతడు బహిరంగంగా అంగీకరించాడు. జాక్విలిన్ ఎప్పుడూ సుకేష్ తో సంబంధాల కోసం తపించిందని, కెరీర్ డైలమా గురించి బయపడిందని కూడా నోరా ఆరోపించింది. ఈ ఇద్దరి వ్యవహారంపై పోలీసుల విచారణ కూడా సాగింది.
అయితే గ్లామర్ అండ్ గ్లిజ్ ప్రపంచంలో ప్రముఖులతో కథానాయికల సంబంధాలను పరిశీలిస్తే, ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ రంగంలో పాపులర్ దర్శకులు, నిర్మాతలతో సంబంధాల కోసం కథానాయికలు ఆరాటపడే సన్నివేశాలు ఉంటాయి. ఇక్కడ ఒడిదుడుకుల్ని తట్టుకుని నిలదొక్కుకోవాలంటే పరిశ్రమలో గాడ్ ఫాదర్ అవసరం. నోరా, జాక్విలిన్ వంటి వారు ఇంకా ఈ రంగంలో ఎందరో. కానీ బహిరంగంగా తెలిసేవి కొన్ని మాత్రమే. పరిశ్రమలో లైంగిక వేధింపులు ఒక కోణం అనుకుంటే, కథానాయికలు లేదా నటీమణులు ఇష్టపూర్వకంగా ఇచ్చే కమిట్ మెంట్ల గురించి అప్పుడప్పుడు గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి. నాణేనికి రెండో వైపు తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.