• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సుధీర్ బాబు హరోంహర.....

సుధీర్ బాబు హరోంహర.. సుబ్రహ్మణ్యుడి ఆగమనం!

| ఈ సినిమాకు జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. సుమంత్‌ నాయుడు నిర్మిస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-02-14 12:33 GMT

నైట్రో స్టార్ సుధీర్ బాబు జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. గతేడాది హంట్, మామా మశ్చీంద్ర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆ రెండు మూవీలు డిజాస్టర్లు అయ్యాయి. ఈసారి కచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో హరోం హర అనే మాస్ మూవీతో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. సుమంత్‌ నాయుడు నిర్మిస్తున్నారు.


ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి పోస్ట‌ర్లతో పాటు టీజ‌ర్‌ ను విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. తాజాగా చిత్ర‌ యూనిట్ మ్యూజిక‌ల్ అప్డేట్ ఇచ్చింది. హరోం హర అంటూ సాగే లిరికల్ సాంగ్ ను బుధవారం సాయంత్రం రిలీజ్ చేసింది. శంభు కుమారుడు సుబ్రహ్మణ్యుడి ఆగమనం - సంగ్రామం - సంభవం అంటూ ట్వీట్ చేసింది. కల్యాణ్ చక్రవర్తి త్రిపురనేని లిరిక్స్ అందించిన ఈ పాటను స్టార్ సింగర్ అనురాగ్ కులకర్ణి ఆలపించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

సాంగ్ స్టార్టింగ్ లో హీరో సుధీర్ బాబు బస్సు టాప్ పై కూర్చుని ఎక్కడికో వెళ్తున్నట్లు చూపించారు మేకర్స్. భుజానికి బ్యాగ్ వేసుకున్న హీరో.. మల్టీపుల్ షేడ్స్ లో కనిపిస్తున్నారు. చివర్లో సిగరెట్ తో ఫుల్ మాస్ లుక్ లో అదరగొట్టారు సుధీర్ బాబు. భారీ ఫైట్ గ్లింప్స్ ను కూడా సాంగ్ లో యాడ్ చేశారు. వన్ లైన్ లో చెప్పాలంటే.. ఓ క్లాస్ గా ఉండే వ్యక్తి మాస్ గా మారిపోయి గొడ్డలి పట్టుకొని ఊచకోత కోయడాన్ని ఈ సాంగ్ లో చూపించారు మేకర్స్.

మొత్తానికి ఈ సాంగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. సినిమా స్టోరీపై ఆసక్తి పెంచుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సాంగ్ లో అక్కడక్కడ పెద్ద పెద్ద సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు కనిపిస్తుండటం గమనార్హం. కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ పవర్ ఫుల్ గా ఉండగా, చేతన్‌ భరద్వాజ్ సంగీతం ఆకట్టుకుంటోంది. మరోవైపు, కెరీర్ లో తొలిసారి పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు సుధీర్ బాబు.

ఈ సినిమాలో సుధీర్ సరసన మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 1989లో చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాదే హరోం హర మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు మేకర్స్. మరి ఈ సినిమాతో సుధీర్ బాబు కమ్ బ్యాక్ ఇస్తారో లేదో చూడాలి.

Full View
Tags:    
  • Haromharomhara 
  • Lyricalsong 
  • Haromhara 
  • Sudheerbabu 
  • Malvika 
  • Gnanasagar 
  • Chaitanbharadwaj 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS