బిగ్ సర్ ప్రైజ్....పాన్ ఇండియా సినిమాల్లో మహేష్ మేనల్లుడు!

టాలీవుడ్ లో వారసుల ఎంట్రీ అంటే ఎప్పుడూ ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది. తమ అభిమాన హీరో పోలికలతో ఉండే పిల్లలను స్క్రీన్ మీద చూడాలని ఫ్యాన్స్ ఆశపడటం సహజం.;

Update: 2025-11-25 10:35 GMT

టాలీవుడ్ లో వారసుల ఎంట్రీ అంటే ఎప్పుడూ ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది. తమ అభిమాన హీరో పోలికలతో ఉండే పిల్లలను స్క్రీన్ మీద చూడాలని ఫ్యాన్స్ ఆశపడటం సహజం. ఇప్పటికే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు ఇండస్ట్రీని ఏలుతుండగా, గౌతమ్ ఎంట్రీ కోసం వెయిటింగ్ నడుస్తోంది. కానీ ఈలోపే ఆ కాంపౌండ్ నుంచి మరో బాబు వెండితెర అరంగేట్రం చేయడానికి రెడీ అయ్యాడు. అది కూడా మామూలు సినిమాలతో కాదు.

ఈ బుడతడు సోషల్ మీడియాలో ఇప్పటికే ఫుల్ ఫేమస్. అతను మరెవరో కాదు సుధీర్ బాబు చిన్నకొడుకు దర్శన్. ఇప్పటికే తన డ్యాన్స్ వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకున్నాడు. మేనమామ మహేష్ బాబు పోలికలతో ఉంటూ, తండ్రి సుధీర్ బాబు లాంటి ఈజ్ తో కనిపించే ఆ కుర్రాడు ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్స్ సినిమాల్లో ఛాన్స్ కొట్టేశాడు. ఆ రెండు సినిమాలు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ కావడం విశేషం.

'వారణాసి' అనే క్రేజీ ప్రాజెక్ట్ లో దర్శన్ నటించబోతున్నాడని టాక్ వస్తోంది. ఇందులో ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్నప్పటి పాత్రలో దర్శన్ కనిపించనున్నాడట. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. మేనమామ చిన్నప్పటి రోల్ లో మేనల్లుడు కనిపించడం ఫ్యాన్స్ కు పండగ లాంటి వార్త.

కేవలం మహేష్ బాబు సినిమాలోనే కాదు.. డార్లింగ్ ప్రభాస్ సినిమాలో కూడా దర్శన్ కు ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ'లో కూడా దర్శన్ కనిపించనున్నట్లు టాక్ వస్తోంది. ఒకేసారి ఇటు మహేష్ బాబు పాత్రలో, అటు ప్రభాస్ సినిమాలో అవకాశాలు రావడం అంటే దర్శన్ లక్కీ అనే చెప్పాలి.

దర్శన్ కు కెమెరా కొత్తేమీ కాదు. ఇన్నాళ్లు సుధీర్ బాబు తన సోషల్ మీడియా ఖాతాల్లో దర్శన్ చేసే విన్యాసాలను పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఆ వీడియోలకు విపరీతమైన లైకులు, కామెంట్స్ వచ్చేవి. ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్ తో వెండితెరపై సత్తా చాటడానికి వస్తున్నాడు. మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి స్టార్ అయినట్టే, దర్శన్ కూడా అదే బాటలో వెళ్తున్నాడు.

మొత్తానికి ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఇప్పుడు ఈ బుడ్డోడు కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టేశాడు. చిన్నప్పుడే ఇలాంటి భారీ ప్రాజెక్టులతో కెరీర్ మొదలుపెడుతున్నాడంటే, భవిష్యత్తులో స్టార్ హీరో అయ్యే ఛాన్సులు గట్టిగానే ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లో దర్శన్ నటన ఎలా ఉంటుందో, ఆడియన్స్ ను ఎలా మెప్పిస్తాడో చూడాలి మరి. సిర్ప్జ్ 

Tags:    

Similar News