ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ రిపోర్ట్... బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా విడుదలకు రెడీ అయింది.;
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా విడుదలకు రెడీ అయింది. మార్చి 19న విడుదల కాబోతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో గబ్బర్ సింగ్ చాలా ప్రత్యేకమైన మూవీ అనడంలో సందేహం లేదు. పవన్ హిట్ సినిమాల జాబితాలో గబ్బర్ సింగ్ ముందు వరుసలో ఉంటుంది. అలాంటి గబ్బర్ సింగ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన హరీష్ శంకర్ మళ్లీ ఇన్నాళ్ల తర్వాత పవన్ తో ఈ సినిమా తీయడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మొదటి నుంచి జాగ్రత్త పడుతూ దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాను రూపొందించాడు. పూర్తి స్థాయి వినోదాత్మకంగా, పక్కా మాస్ కమర్షియల్ మూవీగా ఈ సినిమా ఉంటుందని హరీష్ శంకర్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. ఆయన అన్నట్లుగానే మూవీ ఉందని సెన్సార్ నుంచి వస్తున్న రిపోర్ట్‌ను చూస్తే అర్థం అవుతోంది.
ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ టాక్...
విడుదలకు మరికొన్ని రోజుల సమయం ఉన్న నేపథ్యంలో తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగింది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమా మొత్తం రన్ టైమ్‌ను 2 గంటల 34 నిమిషాలకు లాక్ చేశారు. ఫస్ట్ హాఫ్ ఒక గంట 11 నిమిషాలు కాగా, సెకండ్ హాఫ్ ను ఒక గంటల 23 నిమిషాలకు లాక్ చేశారు. సెన్సార్ పూర్తి అయిన తర్వాత సినిమాపై మరింతగా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సెన్సార్ చేసిన బోర్డ్ సభ్యులు చాలా పాజిటివ్‌గా సినిమా పై వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో అదే ఈ సినిమాలో దర్శకుడు హరీష్ శంకర్ చూపించాడని పేర్కొన్నారు. గబ్బర్‌సింగ్ తరహా ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సాగిందని కూడా వారు అంటున్నారు. హరీష్ శంకర్ స్టైల్, పవన్ కళ్యాణ్ మ్యానరిజంతో సినిమా సాగిందని సెన్సార్ బోర్డ్ వారి టాక్.
గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్...
గబ్బర్‌సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న మరో పవర్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఉస్తాద్ భగత్ సింగ్ ఉందంటూ సెన్సార్ బోర్డ్ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు. తాజాగా సెన్సార్ బోర్డ్ నుంచి వచ్చిన రిపోర్ట్‌తో సినిమాపై అంచనాలు మరింతగా పెరగనున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చిన విషయం తెల్సిందే. ముఖ్యంగా ఓజీ సినిమా ఫక్త్ ఫ్యాన్స్ మూవీ అన్నట్లుగా సాగింది. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మాత్రం గతంలో వచ్చిన గబ్బర్‌సింగ్ మాదిరిగా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, అన్ని వర్గాల వారిని అలరించే మూవీగా నిలువబోతుంది. సెన్సార్ రిపోర్ట్ అనుసారం సినిమా అత్యధిక వసూళ్ల రికార్డ్‌ను చేరే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది.
హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ మార్క్ ఎంటర్‌టైనర్..
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటించింది. ఇంకా ముఖ్య పాత్రల్లో రాశి ఖన్నా, సాక్షి వైద్య కనిపించబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ విడుదల కాకుండానే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయడంతో సినిమాకి మరింత పబ్లిసిటీ దక్కడం ఖాయం. మరో రెండు రోజుల్లో ట్రైలర్ విడుదల కానుంది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమా గురించి ఆకాశమే హద్దు అన్నట్లుగా అభిమానుల్లో అంచనాలు పెరుగుతాయని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
తప్పకుండా ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. పవన్ రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నా కొంత సమయంను కేటాయించి ఉస్తాద్ భగత్ సింగ్ ని చేయడం జరిగింది. ఈ సినిమా ఆయన స్థాయిని మరింత పెంచడం ఖాయం అని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ ను దక్కించుకోవడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.