అల్యూమినియం ఫ్యాక్టరీలో బాలయ్య జేసీబీ ఫైట్..!

అదేమిటంటే ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం.. ఫ్యాక్టరీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.;

Update: 2026-03-12 05:45 GMT

నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా NBK111 షూటింగ్ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా షూటింగ్ గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. అదేమిటంటే ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం.. ఫ్యాక్టరీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

సినిమాకి హైలైట్ గా నిలబడి ఉన్న జెసిబి ఎపిసోడ్..!

ఈ షెడ్యూల్‌లో ప్రత్యేకంగా జేసీబీ ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. రాత్రి ఎఫెక్ట్‌లో ఈ ఫైట్ సీన్ షూట్ జరుగుతోంది. సినిమా టీమ్ తెలిపిన ప్రకారం ఈ షెడ్యూల్ ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇక ఈ సినిమాలో ఈ సీన్ హైలైట్ గా నిలవనుంది అని సమాచారం.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే..అఖండ 2 విడుదల తర్వాత బాలకృష్ణ కొంత విరామం తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు.

అయితే మార్కెట్ పరిస్థితులు.. బడ్జెట్ పరిమితులు కారణంగా ఆ ప్రాజెక్ట్‌లో కొన్ని మార్పులు జరిగాయి. దీంతో దర్శకుడు కొత్త కథపై పని చేశారు. ఆ కారణంగా NBK111 ప్రారంభం కొన్ని నెలలు ఆలస్యమై.. ఒక వారం ముందే షూటింగ్ మొదలుపెట్టింది. మొదటి షెడ్యూల్‌లోనే ఈ అల్యూమినియం ఫ్యాక్టరీ.. భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా నయనతార నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాను నిర్మాత వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా టీమ్ ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. షూటింగ్ పూర్తయ్యాక బాలకృష్ణ తన తదుపరి చిత్రం NBK112 పనులు కూడా ప్రారంభించే అవకాశం ఉంది.

Tags:    

Similar News