బ‌న్నీ-అట్లీ బ్లాక్ బ‌స్ట‌ర్ ప్లాన్ అదిరిపోయిందే!

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ల్లో బ‌న్నీ-అట్లీ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న చిత్రం ఒక‌ట‌ని చెప్పాల్సిన ప‌నిలేదు.;

Update: 2026-03-12 06:36 GMT

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ల్లో బ‌న్నీ-అట్లీ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న చిత్రం ఒక‌ట‌ని చెప్పాల్సిన ప‌నిలేదు. గ్లోబ‌ల్ స్థాయిలోనే ఈ చిత్రం రిలీజ్ ప్లానింగ్ జ‌రుగుతోంది. వీలైతే? `వార‌ణాసి` రిలీజ్ థియేట‌ర్ల‌ను మించి బ‌న్నీ ప్రాజెక్ట్ ను రిలీజ్ చేయాల‌ని అట్లీ ప్లాన్ చేస్తున్నాడు. మ‌రి దీనికి సంబంధించి అట్లీ ఎలాంటి మార్కెటింగ్ స్ట్రాట‌జీ అనుస‌రిస్తున్నాడు? అంటే ఓ ఆస‌క్తిక‌ర సంగ‌తి వెలుగులోకి వ‌స్తోంది. ఈ సినిమా గ్లింప్స్‌ను బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ చేతుల మీదుగా లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉన్న‌ట్లు తెలిసింది.

ఇదే నిజ‌మైతే? ఇది కేవ‌లం ప్ర‌చారం మాత్ర‌మే అవ్వ‌దు. అంత‌కు మించి భారీ గ్లోబల్ మార్కెటింగ్ స్ట్రాటజీ గా చెప్పొచ్చు. బ‌న్నీకి ఇప్ప‌టికే పుష్ప ప్రాంచైజీతో పాన్ ఇండియాలో సంచ‌ల‌నం అయ్యాడు. గ‌ల్ప్ దేశాల్లో సైతం ప్యాన్ బేస్ ఏర్పడుతుంది. అక్క‌డ అత‌డు కొత్త‌గా త‌న‌ని తాను ఇంట‌ర్ డ్యూస్ చేసుకోవాల్సిన ప‌నిలేదు. కానీ షారుక్ ఖాన్‌కు ఉన్న గ్లోబల్ రీచ్ పూర్తిగా భిన్నమైనది. షారుక్ ఒక గ్లింప్స్‌ను లాంచ్ చేయడం వల్ల ఆ సినిమా కేవలం సౌత్ ఇండియా సినిమాగా కాక‌ ఇండియన్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది.

షారుక్ సోషల్ మీడియా వేదికల ద్వారా జరిగే ఈ ప్రచారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన కోట్లాది మంది అభిమానులకు ఈ సినిమా రీచ్ అవుతుంది. షారుక్ కార‌ణంగా ఈ సినిమాకు ఓవర్సీస్ బిజినెస్ పరంగా భారీ లాభం చేకూరుతుంది. ప్ర‌త్యేకించి పాశ్చాత్య దేశాల్లో భారతీయ సినిమాలకు షారుక్ ఖాన్ ఒక బ్రాండ్ అంబాసిడర్ లాంటి వారు. ఆయన ఒక సినిమాను ప్రమోట్ చేస్తున్నారంటే? అది నాణ్యమైన కంటెంట్‌తో కూడిన భారీ చిత్రం అనే నమ్మకం అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్లలో ఏర్ప‌డుతుంది .

క్రాస్-కల్చరల్ అప్పీల్ అన్న‌ది బాలీవుడ్ మార్కెట్‌లోనూ సినిమాకు హైప్ రెట్టింపు అవుతుంది. ఉత్త‌రాది రాష్ట్రాల్లో రెట్టింపు ఓపెనింగ్స్ కు అవ‌కాశం ఉంటుంది. ఈ కలయిక టాలీవుడ్ - బాలీవుడ్ మధ్య ఉన్న దూరాన్ని మరింత తగ్గిస్తుంది. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద భారతీయ సినిమా సత్తా చాట‌డానికి అవ‌కాశాలు మెండుగా ఉండాయి. షారుక్ ఖాన్‌కు చైనా, జర్మనీ, అమెరికా , గల్ఫ్ దేశాల్లో ఉన్న మార్కెట్ అనూహ్యమైనది. ఆయన ప్రమేయం వల్ల ఈ సినిమాను ఆయా దేశాల్లోని ప్రధాన భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయడానికి మార్గం సుగమం అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే? అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగే క్రమంలో షారుక్ ఖాన్ మద్దతు అన్న‌ది ఓ లాంచ్ ప్యాడ్ లా పని చేస్తుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News