పరాశక్తిపై పెరుగుతున్న వివాదం.. స్పందించిన దర్శకురాలు!

లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో శ్రీ లీల హీరోయిన్గా వచ్చిన చిత్రం పరాశక్తి. జనవరి 10వ తేదీన కోలీవుడ్ లో ఈ సినిమా విడుదలయ్యింది.;

Update: 2026-01-14 08:19 GMT

మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్. విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే శివ కార్తికేయన్.. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ముఖ్యంగా ఈ సినిమా ఇప్పటివరకు తీసిన చిత్రాల కంటే భిన్నం అనే చెప్పాలి. ఎందుకంటే 1965లో తమిళనాడులో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. హిందీ వ్యతిరేక నిరసన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. అంటే నిజ జీవిత సంఘటనల ఆధారంగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు విమర్శలు ఎదుర్కోవడం గమనార్హం. ఈ సినిమా డిజాస్టర్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.. అంతేకాదు ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలి అని తమిళనాడు యూత్ కాంగ్రెస్ ఆడియన్స్ కి పిలుపునిచ్చారు.

వాస్తవానికి ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. కొంతమంది కావాలనే నెగిటివ్ రుద్దుతున్నారని, సినిమాపై దుష్ప్రచారం చేస్తున్నారు అని చిత్ర బృందం ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు రోజురోజుకీ విమర్శలు పెరిగిపోవడం.. వివాదం ముదురుతున్న నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర దర్శకురాలు సుధా కొంగర ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఊహించని కామెంట్లు చేసింది.

లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో శ్రీ లీల హీరోయిన్గా వచ్చిన చిత్రం పరాశక్తి. జనవరి 10వ తేదీన కోలీవుడ్ లో ఈ సినిమా విడుదలయ్యింది. తెలుగులో జనవరి 10వ తేదీన డబ్బింగ్ తెలుగు వెర్షన్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇక్కడ ది రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు సినిమాలు ఉండడంతో థియేటర్లు దొరక్క తమ ఆలోచనను విరమించుకున్నారు. జనవరి 23న ఈ సినిమా రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే కోలీవుడ్లో విడుదలైన ఈ సినిమాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా హీరో విజయ్ అభిమానులే ఈ సినిమాను ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ చేస్తున్నారని.. ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన రామనాథ్ ప్రత్యక్షంగా ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఇప్పుడు తాజాగా దర్శకురాలు సుధా పరోక్షంగా అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.

సుధా కొంగర ఒక హాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.." నేను దర్శకత్వం వహించిన పరాశక్తి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా ఇబ్బందులు తప్పలేదు. నిజానికి ఒక సినిమాను ప్రేక్షకులకు అందించడం ఎంత కష్టంగా మారింది అంటే.. ఆ సినిమా బాగున్నా సరే నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నో సవాళ్లు దాటి ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆ సినిమాకి ప్రాణం లేకుండా చేస్తున్నారు. ఈ సంక్రాంతికి మా పరాశక్తి మరింత ఆదరణ సొంతం చేసుకుంటుందని ఆశిస్తున్నాను.

ఇకపోతే ఈ సినిమాకి ఒక వర్గానికి చెందిన అభిమానుల వల్లే మాకు ఈ ఇబ్బందులు.. ఫేక్ ఐడీలతో మాపై దారుణమైన పోస్టులు పెడుతూ నెగెటివిటీ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఇదంతా ఎవరు చేస్తున్నారో కూడా మాకు బాగా తెలుసు అంటూ అసహనం వ్యక్తం చేసింది సుధా కొంగర. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా అటు విజయ్ అభిమానులు ఇటు తమిళనాడు కాంగ్రెస్ యూత్ కావాలనే ఈ సినిమాను తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ ఇన్ డైరెక్ట్ గా స్పందించింది సుధా కొంగర.

Tags:    

Similar News