ఆ ఏడుపుని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా!
వరుస పరాజయాలుతో పాటూ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ లో ఎదుర్కొన్న ఇబ్బందుల వల్ల టాలీవుడ్ హీరో ఉదయ కిరణ్ ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే.;
వరుస పరాజయాలుతో పాటూ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ లో ఎదుర్కొన్న ఇబ్బందుల వల్ల టాలీవుడ్ హీరో ఉదయ కిరణ్ ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. ఉదయ్ కిరణ్ అకాల మరణం ఎంతో మందిని బాధ పెట్టగా, అతనితో అనుబంధం ఉన్న వారైతే అతని మరణాన్ని అసలు మనసుకి తీసుకోలేకపోయారు. వారిలో టాలీవుడ్ సీనియర్ నటి సుధ కూడా ఒకరు.
అందుకే దత్తత తీసుకోవాలనుకున్నా!
ఉదయ్ కిరణ్ తో సుధకు మంచి బాండింగ్ ఉంది. ఉదయ్ కిరణ్ అంటే తనకెంతో ఇష్టమని, తనని దత్తత కూడా తీసుకోవాలనుకున్నట్టు సుధ పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే ఉదయ్ కిరణ్ అనే పేరు ఎత్తగానే ఆమెంతో ఎమోషనల్ అయిపోతారు. చిన్నప్పుడే ఉదయ్ కిరణ్ కు తల్లి చనిపోవడం, తండ్రి దూరమవడం, మ్యారేజ్ లైఫ్ డిస్ట్రబ్ అవడంతో ఉదయ్ కిరణ్ చాలా ఇబ్బంది పడేవాడని, ఎందుకో తెలియకుండానే ఉదయ్ కిరణ్ ను చూస్తే దేవుడు తనకు ఇచ్చిన బిడ్డ అనే ఫీలింగ్ వస్తుందని చెప్పారు.
ఆ టైమ్ లో అందరినీ దూరం పెట్టాడు
ఉదయ్ కిరణ్ ను దత్తత తీసుకోవడానికి లీగల్ గానే అన్ని ఏర్పాట్లు చేశానని, కోర్టు నుంచి ఆర్డర్ వస్తే దత్తత తీసుకోవడమే లేట్ అనే టైమ్ కు ఉదయ్ కిరణ్ తన ఫోన్ కట్ చేయడం, క్రమంగా మాటలు తగ్గిపోవడం జరిగాయని, అందరినీ దూరం పెడుతూ వచ్చాడని, అతను ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వద్దని చెప్పడమే దానికి కారణమని ఆమె చెప్పారు.
కాళ్లు పట్టుకుని ఏడ్చాడు
అయితే తర్వాత తాను పెళ్లి చేసుకోబోయే సంగతి కూడా తనకు చెప్పలేదని, మనసుకి బాధేసి పెళ్లికి వెళ్లలేదని, ఆ అమ్మాయి ఉదయ్ కు సెట్ అవకపోవచ్చని తన మనసుకి అనిపించినట్టు ఆమె ఓ సందర్భంలో చెప్పారు. తర్వాత కొన్నాళ్లకు షూటింగ్ జరుగుతున్న లొకేషన్ కు వచ్చి కాళ్ల కింద కూర్చుని కాళ్లు పట్టుకుని ఏడ్చాడని, ఆ ఏడుపుని తానెప్పటికీ మరచిపోలేనని, ఉదయ్ తో ఏదో జన్మలో అనుబంధం ఉండి ఉంటుందని, అది ఇలా తీర్చుకుని తను వెళ్లిపోయాడని సుధ ఎమోషనల్ గా చెప్పారు.