కలిసొచ్చిన 'మే' కంటున్యూ అవుతుందా?
గడిచిన నాలుగు నెలల కాలంలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ వాటిలో హిట్ చిత్రాలేని అంటే ఐదారు సినిమాలే కనిపిస్తున్నాయి.;
గడిచిన నాలుగు నెలల కాలంలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ వాటిలో హిట్ చిత్రాలేని అంటే ఐదారు సినిమాలే కనిపిస్తున్నాయి. నాలుగు నెలల కాలంలో 70కి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రముఖంగా చెప్పుకోవాల్సిన సినిమాల సంఖ్య ఆధారంగా చూసుకుంటే 70 గా తేలింది. వీటిలో ఎన్ని చిత్రాలు విజయాలు సాధించాయి? అంటే కేవలం ఐదు సినిమాలు మాత్రమే కనిపిస్తున్నాయి.
సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన `సంక్రాంతికి వస్తున్నాం` బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అలాగే బాలకృష్ణ నటించిన `డాకు మహారాజ్` యావరేజ్ గా ఆడింది. అటుపై ఫిబ్రవరిలో యువ సామ్రాట్ నాగ చైతన్య నటించిన `తండేల్` పాన్ ఇండియాలో రిలీజ్ అయింది. ఆ సినిమాతో చైతన్య 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత రిలీజ్ అయిన `మ్యాడ్ స్క్వేర్` మంచి విజయం సాధించింది.
ఇవన్నీ జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో రిలీజ్ అయిన చిత్రాలు. అయితే ఈ నాలుగు నెలలు కంటే `మే` రిలీజ్ లు కలిసొచ్చాయి. నాని నటించిన` హిట్ 3` మే 1 రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. అటుపై మే 9న శ్రీవిష్ణు నటించిన `సింగిల్` రిలీజ్ అయింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ అయిన సినిమా థియేటర్లన్నీ ఫుల్ అవుతున్నాయి. ఇప్పటికీ మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తుంది.
పోటీగా మరే సినిమా కూడా లేకపోవడంతో కలెక్షన్లు స్థిరంగా ఉన్నాయి. అలాగే సమంత నిర్మించిన `శుభం` ఓ వర్గం ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటుంది. సమంత నిర్మాణం నుంచి కావడంతో ఆ బ్రాండ్ మార్కెట్ లో వర్కౌట్ అవుతుంది. సమంత అభిమానులు థియేటర్లకు వెళ్లి చూస్తున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన `జగదీక వీరుడు అతిలోక సుందరి` రీ-రిలీజ్ లోనూ దుమ్ముదులిపేస్తోంది. తొలి రోజే కోటికి పైగా వసూళ్లను సాధించింది.
ఇలా మేలో ఇప్పటి వరకూ రిలీజ్ అయిన సినిమాలు మంచి ఫలితాలు సాధించాయి. ఇదే నెలలో మరికొన్ని రిలీజ్ లు ఉన్నాయి. ప్రముఖంగా విజయ్ దేవరకొండ `కింగ్ డమ్` 30న భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది. అదే రోజు `బైరవం` కూడా రిలీజ్ అవుతుంది. ఈ రెండు హిట్ అయితే `మే`కి హ్యాపీ ఎండింగ్.