కపూర్ బ్యూటీలా అనీత్ పడ్డా ఎదగడం ఖాయమేనా!
దీంతో ఇప్పుడీ బ్యూటీ బాలీవుడ్ లో శ్రద్దా కపూర్ లా ఎదుగోతోంది అన్న మాట బలపడుతుంది. శ్రద్దా కపూర్ కూడా `ఆషీకీ 2`తోనే ఫేమస్ అయింది.;
దిల్ రాజు చెప్పినట్లు వంద మంది ప్రయత్నిస్తే అందులో సక్సస్ అయ్యేది ఒకరో..ఇద్దరో ఉంటారు. అది నటులైనా...దర్శకులైనా..ఇంకే విభాగమైనా. నిజాయితీగల ప్రయత్నంతో పాటు ప్రతిభ..అదృష్టం కలిసి వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. అందుకు ఇండస్ట్రీ నుంచి వారసత్వమే అవసరం లేదు. ట్యాలెంట్ ...లక్ ఉంటే చాలు అని తాజాగా మరో బాలీవుడ్ నటి విషయంలో ప్రూవ్ అయింది. రాజుగారు ఈక్వెషన్ కరెక్ట్ అనిపించింది. ఇటీవల రిలీజ్ అయిన `సైయారా` చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.
ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా ఇప్పటికే 150 కోట్ల వసూళ్లను సాధించింది. 200 కోట్ల క్లబ్ లో పక్కాగా చేరే చిత్రంగా హైలైట్ అవుతుంది. ఇందులో నటించిన హీరో, హీరోయిన్ ఇద్దరు కొత్త వారే. గతంలో ఎలాంటి అనుభవం లేదు. హీరోయిన్ విషయానికి వస్తే .. అనీత్ పడ్డా కెరీర్‌ను `సలామ్ వెంకీ `తో లాంచ్ చేసింది. అటుపై అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ బిగ్ గర్ల్స్ డోంట్ క్రై లో నటించింది. ఈ ఈ రెండు తప్ప ఇంతకు మించిన ట్రాక్ రికార్డు ఏం లేదు. కానీ `సైయారా` విజయంతో ఒక్కసారిగా ఇండియా అంతటా ఫేమస్ అయింది.
దీంతో ఇప్పుడీ బ్యూటీ బాలీవుడ్ లో శ్రద్దా కపూర్ లా ఎదుగోతోంది అన్న మాట బలపడుతుంది. శ్రద్దా కపూర్ కూడా `ఆషీకీ 2`తోనే ఫేమస్ అయింది. ఆ సినిమా కూడా శ్రద్దాకి మూడవ చిత్రం కావడం విశేషం. ఇప్పుడీ రెండు చిత్రాలకు దర్శకత్వం వహించింది కూడా మోహిత్ సూరినే. దీంతో ఈ సెంటిమెంట్ అనీత్ పడ్డాకు కలిసొస్తుందని బాలీవుడ్ మీడియా జోస్యం చెబుతోంది.
`ఆషీకి 2` తర్వాత శ్రద్దా కపూర్ బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయిపోయింది. అప్పటి వరకూ నత్తనడకన సాగిన కెరీర్ ఒక్క సారిగా పరుగులు పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కెరీర్ లో వెనక్కి తిరిగి చూడ లేదు. లేడీ ఓరియేంటెడ్ చిత్రాలతోనూ సత్తా చాటుతోంది. అదే తరహాలో అనీత్ పడ్డా కూడా బాలీవుడ్ లో శక్తివంతమైన నాయికగా ఎదుగుతుందని భావిస్తున్నారు.