ఏఐతో ఆ సూపర్ హిట్ సిరీస్ ను ఎండ్ చేశారా?
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్5 రాయడానికి డఫర్ బ్రదర్స్ చాట్ జీపీని వాడారని, అందుకే సీజన్ 5 చెప్పుకోదగ్గ రీతిలో లేదని ఇప్పుడు అర్థమవుతుందని ఒక నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా;
సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఏఐ, చాట్ GPT ను విపరీతంగా వాడుతున్నారు. మొదట్లో ఏఐ, చాట్ జీపీటీ ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడు, ఈ రెండూ ప్రపంచంలోని ఉద్యోగాలను భర్తీ చేస్తాయని చెప్పడంతో హాలీవుడ్ లోని స్క్రీన్ రైటర్స్ ఆల్మోస్ట్ సమ్మె చేసినంత పని చేశారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా నెట్‌ఫ్లిక్స్ యొక్క స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ మేకర్స్ ఆ స్క్రిప్ట్ ను తయారు చేయడానికి ఏఐని వాడారని ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
రీసెంట్ గా స్ట్రేంజర్ థింగ్స్: వన్ లాస్ట్ అడ్వెంచర్ అనే డాక్యుమెంటరీ రిలీజ్ అవడంతో ఈ చర్చ మొదలైంది. ఆ సిరీస్ క్లైమాక్స్ ఈ విమర్శలను పెంచింది. ఆ ఫైనల్ స్క్రిప్ట్ ను రాసింది రైటర్లు కాదని, సిరీస్ మేకర్స్ పూర్తిగా ఏఐపై డిపెండ్ అయ్యారని చాలా మంది ఆరోపించారు. దానికి తోడు మేకర్స్ కు చెందిన కంప్యూటర్లలో చాట్ జీపీటీకి సంబంధించిన ట్యాబ్స్ ఓపెన్ చేసి కనిపించిన విజువల్స్ కూడా ఉండటంతో ఆ ఊహాగానాలకు అవన్నీ ఆజ్యం పోశాయి.
చాట్‌జీపీటీని వాడిన డఫర్ బ్రదర్స్
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్5 రాయడానికి డఫర్ బ్రదర్స్ చాట్ జీపీని వాడారని, అందుకే సీజన్ 5 చెప్పుకోదగ్గ రీతిలో లేదని ఇప్పుడు అర్థమవుతుందని ఒక నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, మరొకరు డఫర్ బ్రదర్స్ ఈ సీజన్ స్క్రిప్టింగ్ చేసేటప్పుడు చాట్ జీపీటీ, రెడిట్ ను వాడారని, అదంతా చెత్తగా ఉందని ఆరోపించారు. ఇదిలా ఉంటే ఫైనల్ ఎపిసోడ్ ను ఇష్టపడే ఆడియన్స్ కూడా లేకపోలేదు.
సిరీస్ ఎండింగ్ పట్ల తాము సంతృప్తికరంగా ఉన్నామని, ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్ ను క్రియేట్ చేయడంలో ఏఐ ఇలా సహాయపడుతుందంటే అది చాలా మంచి పరిణామమేనని, అయినా ఇన్‌పుట్ ఇచ్చి, కావాల్సిన స్క్రిప్ట్ ను రెడీ అయ్యేలా చేస్తుంది క్రియేటర్లేనని, మనం ఏఐకు ఇచ్చే ఇన్‌పుట్స్ వల్లే స్క్రిప్ట్ రెడీ అవుతుందని అంటున్నారు. 2016 లో మొదలైన స్ట్రేంజర్ థింగ్స్ తొమ్మిదేళ్ల తర్వాత 2025లో ముగిసింది.