మంచి కథ+ సరైన VFX.. అప్పుడే బొమ్మ హిట్!

మంచి కథకు సరైన వీఎఫ్ ఎక్స్ జోడిస్తే అప్పుడే బొమ్మ సూపర్ హిట్.. రీసెంట్ గా ఇది మూడు సినిమాల విషయంలో ప్రూవ్ అయింది.;

Update: 2025-09-06 21:30 GMT

మంచి కథకు సరైన వీఎఫ్ ఎక్స్ జోడిస్తే అప్పుడే బొమ్మ సూపర్ హిట్.. రీసెంట్ గా ఇది మూడు సినిమాల విషయంలో ప్రూవ్ అయింది. స్క్రిప్ట్ ఎంత బలంగా ఉన్నా.. బలహీనమైన వీఎఫ్ ఎక్స్ ఉంటే కచ్చితంగా దెబ్బపడుతుంది. అలా అని కథ వీక్ గా ఉండి.. వీఎఫ్ ఎక్స్ ఎంత బాగా ఉన్నా కూడా లాభముండదని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

అటు కథ బాగుండాలి.. ఇటు వీఎఫ్ ఎక్స్ వర్క్ సరిగ్గా ఉండాలి.. అప్పుడే సినిమా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలుస్తుంటుంది. ప్రస్తుత రోజుల్లో ఆడియన్స్.. సినిమా కంటెంట్ కు సరిపడే విజువల్స్ ను ఆశిస్తున్నారు. అందుకే వీఎఫ్ ఎక్స్ వర్క్ సరిగ్గా లేకపోతే.. నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మూవీ విషయంలో నిరుత్సాహపడుతున్నారు.

రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తన బాలీవుడ్ డెబ్యూ వార్-2 మూవీ చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. సినిమా స్క్రిప్ట్ ఓకే అయినా.. వీఎఫ్ ఎక్స్, ఎడిటింగ్ వర్క్ అస్సలు బాగోలేదని అనేక మంది సినీ ప్రియులు అభిప్రాయపడ్డారు.

సినిమాలో ఎక్కువగా గ్రీన్ స్క్రీన్ వినియోగించినట్లు ఉన్నారని, వీఎఫ్ ఎక్స్ కోసం భారీ బడ్జెట్ పెట్టినా లాభం లేదని అప్పట్లో రివ్యూస్ ఇచ్చారు. అదే సమయంలో ఇటీవల వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన మహావతార్ నరసింహ, లోకా వంటి చిత్రాలు బలమైన విజువల్స్‌ కు ఎల్లప్పుడూ భారీ బడ్జెట్‌ అవసరం లేదని నిరూపించాయి.

ఎందుకంటే సరైన విధంగా వీఎఫ్ ఎక్స్ వర్క్ చేయడంతో పాటు మంచి కంటెంట్ ఉండడంతో రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. వీఎఫ్ ఎక్స్ ను సృజనాత్మకంగా ఉపయోగిస్తే సినిమా కచ్చితంగా మంచి సినిమాటిక్ ఎక్సపీరియన్స్ ఇస్తాయని రెండు చిత్రాలు నిరూపించాయని ఇప్పుడు పలువురు నెటిజన్లు చెబుతున్నారు.

ఓవరాల్ గా.. సినీ ప్రియుల ఆలోచన విధంలో చాలా మార్పులు వచ్చాయి. నేటి ప్రేక్షకులు అటు స్క్రిప్ట్.. ఇటు వీఎఫ్ ఎక్స్ రెండూ ఒకదానికొకటి లింకప్ గా ఉండాలని ఆశిస్తున్నారు. రెండూ బాగుండాలని కోరుకుంటున్నారు. ఆకర్షణీయమైన రచనకు అద్భుతమైన విజువల్స్‌ తో మిళితం చేసే అసాధారణ కంటెంట్ ను ఎక్పెక్ట్ చేస్తున్నారు. మరి భవిష్యత్తులో మేకర్స్ ఏం చేస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News