వారసుల విషయంలో వాళ్లంతా సంతృప్తిగానే ఉన్నారా?
తాను వేసిన బాటలో సుఖంగా తనయుడు ప్రయాణం సాగించాలని కోరుకుంటారు. కానీ ఆ ప్రయాణం తారుమారు నిరుత్సాహ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.;
స్టార్ హీరో వారసుడు ఇండస్ట్రీకి వస్తున్నాడంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా వారసుల ఎంట్రీ విషయంలో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగించే తనయుడిగా భావించి నిలబెట్టాల్సిన బాధ్యత తమదిగానే భావిస్తారు అభిమానులు. తనయుల విషయంలో తండ్రులు..కుటుంబాలు కూడా అలాంటి అంచనాలు..ఆశలే పెట్టుకుంటారు.
తాను వేసిన బాటలో సుఖంగా తనయుడు ప్రయాణం సాగించాలని కోరుకుంటారు. కానీ ఆ ప్రయాణం తారుమారు నిరుత్సాహ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తనయుడు ఇష్టమైన మార్గాన్ని ఎంచుకున్నా? తన మార్గంలో నడవలేదు? అనే పెయిన్ వెంటాడుతూనే ఉంటుంది. మరి ఈ వారసుల విషయంలో తండ్రులు సంతోషంగా ఉన్నారో? లేదో తెలియదు గానీ అభిమానులను మాత్రం నిరుత్సాహ పరిచారు అన్నది వాస్తవం.
వివరాల్లోకి వెళ్తే దళపతి విజయ్ కోలీవుడ్ లో పెద్ద స్టార్. కోట్లాది మంది అభిమానులున్న స్టార్. కొత్తగా రాజకీయ పార్టీ కూడా స్థాపించి ప్రజలకు సేవ చేసే బాధ్యత నెత్తిన వేసుకుంటున్నాడు. వచ్చే ఎన్నికల బరిలో సీఎంగా దిగుతున్నాడు. ఇంత ఛరిష్మా ఉన్న విజయ్ తనయుడు జాసన్ సంజయ్ హీరో కాకుండా డైరెక్టర్ అవుతున్న సంగతి తెలిసిందే. అంత పెద్ద స్టార్ తనయుడు హీరో అవుతాడని అభిమానులు ఎంతో ఆశగా చూస్తోన్న సమయంలో ట్విస్ట్ ఇచ్చాడు.
ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కి స్తున్నా డు. సరిగ్గా ఇదే మార్గాన్ని ఎంచుకున్నాడు బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్. షారుక్ దేశం మెచ్చిన స్టార్. అంత పెద్ద స్టార్ హీరోగా మ్యాకప్ వేసుకోకుండా కెప్టెన్ గా కుర్చీ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. హీరో అవ్వమని షారుక్ ఎంత బ్రతిమ లాడినా తాను మాత్రం క్రియేటివ్ రంగంలోనే ఉంటానని పట్టుబట్టి ఉన్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ వరుస కూడా ఇలాగే కనిపిస్తుంది. పవన్ హీరోను చేద్దామనుకుంటే అకీరా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే ఆలోచనలో ఉన్నాడు. చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఇష్టం. మంచి గిటారిస్ట్ కూడా. కెరీర్ విషయంలో తల్లిదండ్రులు అకీరాకు పూర్తి స్వేచ్ఛనిచ్చేసారు. మరి సంగీత దర్శకుడు అవుతాడా? హీరో అవుతాడా? అన్నది చూడాలి.