అదేంటి.. జక్కన్నకు ఆయన కూడా నో చెప్పారా?
దర్శకధీరుడు రాజమౌళి బ్లాక్ బస్టర్ హిట్ ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే.;
దర్శకధీరుడు రాజమౌళి బ్లాక్ బస్టర్ హిట్ ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. ఫారెస్ట్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతున్న SSMB 29 షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్, ఒడిశా షెడ్యూల్స్ ను మేకర్స్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు మరో షెడ్యూల్ ను స్టార్ట్ చేసినట్లు సమాచారం. మొత్తానికి మూవీకి సంబంధించి జక్కన్న ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్ గా షూటింగ్ ను నిర్వహిస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రాజెక్ట్ కు సంబంధించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా క్యాస్టింగ్ కోసం ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి.
సినిమాలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఉంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. అంతకుమించి ఒక్కరి కోసం కూడా తెలియదు. రీసెంట్ గా బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ను మేకర్స్ సంప్రదించగా.. ఆయన నటించేందుకు నో చెప్పారని టాక్ వినిపించింది.
రాజమౌళి సినిమాకు నో చెప్పినంత కారణమేంటోనని అంతా మాట్లాడుకున్నారు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కూడా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం ఆయనకు సెలెక్ట్ చేయగా తిరస్కరించారని సమాచారం. విలన్ రోల్ కాబట్టి చేయనని నిర్ణయించుకోవడంతో విక్రమ్ నో చెప్పారట.
విక్రమ్ రిజెక్ట్ చేసిన రోల్ నే పృథ్వీరాజ్ సుకుమారన్ చేస్తున్నారని కొందరు అంటుండగా.. ఆర్.మాధవన్ నటించనున్నారని మరికొందరు చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఆయన సెట్స్ లోకి అడుగు పెట్టనున్నట్లు ప్రచారం సాగుతోంది. మొత్తానికి మహేష్ కు ఆపోజిట్ గా విలన్ రోల్ లో పృథ్వీరాజ్ లేదా మాధవన్ కనిపించనున్నారన్నమాట.
ఇక సినిమా విషయానికొస్తే.. ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహసికుడి కథగా రూపొందుతున్న మూవీల మహేష్ నెవ్వర్ బిఫోర్ లుక్ లో కనిపించనున్నారు. అందుకోసం ఆయన ఎప్పటి నుంచో మేకోవర్ అవుతున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారని వినికిడి. 2026 లేదా 2027లో సినిమా రిలీజ్ అవ్వనుందని టాక్.