• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హాలీవుడ్ బిగ్ స్టూడియోతో...

హాలీవుడ్ బిగ్ స్టూడియోతో జక్కన్న.. ప్లాన్ ఏంటీ?

| టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ SSMB 29 కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే

By - M Prashanth
Update: 2025-09-16 05:41 GMT

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ SSMB 29 కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఆఫ్రికన్ అడవులు నేపథ్యంలో సాగే సాహస ప్రయాణం గ్లోబల్ ట్రోటర్ గా మూవీ రూపొందుతున్నట్లు టాక్.

అయితే రీసెంట్ గా కెన్యాలోని నైరోబీలో సినిమాకు సంబంధించి బిగ్గెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించినట్లు తెలుస్తోంది. సినిమాకు రాజమౌళి కాస్త డివోషనల్ టచ్ కూడా ఇస్తున్నట్లు వినికిడి. ఇప్పుడు ఫిల్మ్ సిటీ లో కాశీ సెట్ వేసినట్లు టాక్ వినిపిస్తోంది.

అక్టోబర్ 10వ తేదీ వరకు ఆ సెట్‌ లో మహేష్ బాబుతో పాటు మెయిన్ క్యాస్టింగ్ పై మేకర్స్ కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఎలాంటి లీక్స్ కాకుండా జక్కన్న కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వినికిడి. అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. రాజమౌళి భారీ డీల్ కుదుర్చుకున్నారట.

ఇటీవల హాలీవుడ్ స్టూడియోతో ఒక ప్రధాన ఒప్పందాన్ని ఆయన ఖరారు చేసుకున్నారని తెలుస్తోంది. ప్రముఖ వార్నర్ బ్రదర్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి- మహేష్ మూవీని డిస్ట్రిబ్యూట్ చేయనుందని ప్రచారం జరుగుతోంది. అమెరికా సహా కీలకమైన అంతర్జాతీయ మార్కెట్లలో సినిమాను ప్రమోట్ చేయనుందని టాక్ వినిపిస్తోంది.

దీంతో సినిమాకు పెద్ద ఎత్తున మద్దతు వచ్చినట్లే. అదే సమయంలో అది నిజమైతే.. రాజమౌళి తన సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్ ను కొన్ని నెలల ముందుగానే హాలీవుడ్ స్టూడియోకు సమర్పించాల్సి ఉంటుంది. విడుదలకు కనీసం మూడు నెలల ముందు కంప్లీట్ మూవీ ఫైల్ ను కూడా సమర్పించాల్సి ఉంటుంది.

మన దగ్గర రిలీజ్ కు వారం ముందే సెన్సార్ ఫార్మాలిటీస్ జరిగితే.. హాలీవుడ్ స్టూడియోలు మాత్రం సాధారణంగా ఒక నెల ముందుగానే అన్ని ఫార్మాలిటీలు కంప్లీట్ చేస్తాయి. ఆ తర్వాత సినిమాకు సంబంధించిన ప్రెస్ షోలు, డిస్ట్రిబ్యూటర్ స్క్రీనింగ్‌ లు, ఇతర ప్రమోషనల్ కార్యకలాపాలను ప్రణాళికతో నిర్వహిస్తాయి. మరి ఇప్పుడు రాజమౌళి ఏం చేస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    
  • SSMB29 
  • MaheshBabu 
  • Rajamouli 
  • WarnerBros 
  • Tollywood 
  • SSMB 29 తాజా వార్తలు 
  • రాజమౌళి మహేశ్ బాబు సినిమా 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS