• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  SSMB 29: లయన్‌తో మహేష్...

SSMB 29: లయన్‌తో మహేష్ వీడియో.. ఇదెక్కడి హడావుడి బాబు!

| టాలీవుడ్‌లోనే కాకుండా మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొల్పిన ప్రాజెక్ట్ SSMB29.

By - M Prashanth
Update: 2025-09-07 19:34 GMT

టాలీవుడ్‌లోనే కాకుండా మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొల్పిన ప్రాజెక్ట్ SSMB29. మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మొదటి అనౌన్స్‌మెంట్ నుంచే పాన్ ఇండియా లెవెల్‌లో హడావుడి చేస్తోంది. ప్రతి అప్‌డేట్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లోనే తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, చర్చనీయాంశమైంది.

18 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో మహేష్ బాబు కెన్యా అడవుల మధ్యలో ఒక స్టిక్ పట్టుకుని నడుస్తూ, ఆయన పక్కనే ఒక సింహం నడుస్తున్నట్లు చూపించారు. ఈ క్లిప్ బయటకివచ్చిన తర్వాత “ఇది నిజంగానే షూటింగ్‌లోనిదేనా?” అని అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున డిస్కషన్ చేస్తున్నారు. కొందరు అయితే ఇది నిజమైన సీన్ అని నమ్ముతూ ఎగ్జైట్ అవుతున్నారు.

కానీ రియాలిటీ ఏంటంటే.. ఆ వీడియో నిజమైనది కాదు. అది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా క్రియేట్ చేసిన క్లిప్. మహేష్ బాబు షూటింగ్ సెట్స్‌లో ఉన్న రియల్ ఫొటోను తీసుకుని, దానిలో AI టచ్ తో పక్కనే లయన్‌ని చూపించారు. జాగ్రత్తగా గమనిస్తే మోషన్, లైటింగ్, షాడోస్ అన్నీ అసలు లొకేషన్‌తో కలిసిపోలేదని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ లీక్ అనేది అసలైన ఫుటేజ్ కాదు, సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసేందుకు కొందరు తయారుచేసిన AI అవుట్‌పుట్ మాత్రమే.

ఇకపోతే, రాజమౌళి సినిమాల్లో యాక్షన్, విజువల్స్ నెవ్వర్ బిఫోర్ అనిపించేలా ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. ఈ సారి కథ మొత్తం ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగుతుంది. కెన్యా, సౌత్ ఆఫ్రికా ప్రాంతాల్లో షూట్ చేస్తున్నారని, హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారని సమాచారం. అందుకే ఇలాంటి వాస్తవానికి దగ్గరగా ఉన్న AI వీడియోలు ఫ్యాన్స్‌కి మరింత రియలిస్టిక్‌గా అనిపిస్తున్నాయి.

ఫ్యాన్స్ ఎగ్జైట్ కావడం సహజమే కానీ, సినిమా యూనిట్ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి వీడియోను రిలీజ్ చేయలేదు. నవంబర్‌లో ఫస్ట్ గ్లింప్స్ రానుందని రాజమౌళి ఇప్పటికే చెప్పాడు. అప్పటివరకూ వస్తున్న లీక్ వీడియోలు, ఫోటోలు అన్నీ ఊహాగానాలే తప్ప, నిజమైనవి కావని గమనించాలి. అయినప్పటికీ, ఈ ఒక్క క్లిప్‌తోనే సినిమా పైన ఉన్న క్రేజ్ ఎలాంటి స్థాయిలో ఉందో అర్థం అవుతోంది. నిజమైన గ్లింప్స్ రాగానే సోషల్ మీడియా మొత్తం ఊగిపోవడం ఖాయం.

#MaheshBabu #SSRajamouli #SSMB29 pic.twitter.com/pTyrJEGIGg

— Mr Palanhaar (@PowerfulReviews) September 6, 2025
Tags:    
  • SSMB29 
  • MaheshBabu 
  • Rajamouli 
  • AIClip 
  • TeluguCinema 
  • మహేష్ బాబు ఎఐ వీడియో 
  • రాజమౌళి సినిమా 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS