క్యామియోలకు ఓకే... కానీ ఫుల్ మూవీ ఎప్పుడు?

మరోవైపు, సినిమా ప్రమోషన్ యాంగిల్ లో చూస్తే ఈ ప్లాన్ ఇప్పటికే పనిచేయడం ప్రారంభించిందనే చెప్పాలి.

Update: 2026-07-08 07:05 GMT

బాలీవుడ్‌లో స్టార్ క్యామియోలు ఇప్పుడు కొత్త మార్కెటింగ్ ఫార్ములాగా మారుతున్నాయి. కథలో కొన్ని నిమిషాలే కనిపించినా, స్టార్ హీరోల ఎంట్రీతో సినిమా చుట్టూ భారీ డిస్క‌ష‌న్ మొదలవుతోంది. ఇప్పుడు జానీ లీవర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఆపరేషన్ ఆపరేషన్ కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తోందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌తో పాటు అక్షయ్ కుమార్ కూడా స్పెష‌ల్ రోల్స్ లో కనిపించనున్నారనే సమాచారం బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా సినిమా పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ముఖ్యంగా షారుఖ్- సల్మాన్ ఒకే సినిమాలో మరోసారి కనిపించబోతున్నారన్న వార్త ఫ్యాన్స్ లో నోస్టాల్జియాను రేకెత్తించింది. అయితే ఈసారి వీరిద్ద‌రూ క‌లిసి ఫుల్ లెంగ్త్ స్టోరీలో కాకుండా కేవలం క్యామియో పాత్రలకే ఇద్దరూ పరిమితమవుతుండటమే డిస్క‌ష‌న్ కు దారితీసింది.

సోషల్ మీడియా వేదికగా పలువురు ఫ్యాన్స్ ఒకే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. కొన్ని నిమిషాల గెస్ట్ రోల్స్ కు టైమ్ కేటాయించే ఇద్దరు సూపర్‌స్టార్లు, ఫుల్ లెంగ్త్ మల్టీస్టారర్‌కు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు. సరైన కథ, స్ట్రాంగ్ డైరెక్ట‌ర్ దొరికితే షారుఖ్- సల్మాన్ కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ హిస్ట‌రీ క్రియేట్ చేసే అవకాశం ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి క్యామియో కంటే పూర్తి సినిమా కోసం ఎదురుచూస్తున్నవారి సంఖ్యే ఎక్కువగా కనిపిస్తోంది.

మరోవైపు, సినిమా ప్రమోషన్ యాంగిల్ లో చూస్తే ఈ ప్లాన్ ఇప్పటికే పనిచేయడం ప్రారంభించిందనే చెప్పాలి. టీజర్, ట్రైలర్ లేదా రిలీజ్ డేట్ పై క్లారిటీ రాకముందే కేవలం స్టార్ కామియోల వార్తలతోనే సినిమాకు భారీ ప్ర‌మోష‌న్ లభించింది. భారీ ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ కంటే ప్రముఖ నటుల పేర్లే ఆడియ‌న్స్ దృష్టిని ఆకర్షించే సాధనంగా మారాయని ఈ పరిణామం మరోసారి రుజువు చేస్తోంది. ఇటీవల బాలీవుడ్‌లో కూడా ఈ క్యామియో కల్చర్ వేగంగా పెరుగుతోంది. ప్రధాన కథకు బలం చేకూర్చడంతో పాటు ఓపెనింగ్‌కు ఎక్స్‌ట్రా ఎట్రాక్ష‌న్ తీసుకురావాలనే ఉద్దేశంతో నిర్మాతలు స్టార్ గెస్ట్ అప్పియరెన్స్‌లపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అయితే స్టార్ ఎంట్రీలు మాత్రమే సినిమా స‌క్సెస్‌ను నిర్ణయించవని ట్రేడ్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. స్టోరీ, ఎంట‌ర్టైన్మెంట్, ఆడియ‌న్స్ ను థియేటర్లలో నిలబెట్టే కంటెంట్ ఉంటేనే క్యామియోలకు అసలైన విలువ వస్తుందని వారు విశ్లేషిస్తున్నారు.

అందుకే ఇప్పుడు ఆపరేషన్ ఆపరేషన్ పై రెండు రకాల ఆసక్తి నెలకొంది. ఒకవైపు షారుఖ్- సల్మాన్- అక్షయ్‌ల స్సెష‌ల్ ఎంట్రీలు ఎలా ఉంటాయన్న ఉత్కంఠ ఉండగా, మరోవైపు క్యామియోల‌తో క్రియేట్ చేసిన ఈ హైప్‌ను సినిమా కంటెంట్ ఎంతవరకు నిలబెడుతుందన్నది ఇండస్ట్రీతో పాటు ఆడియ‌న్స్ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు.

Tags:    

Similar News