ఆదాయం అంతస్తుల్లో ది రియల్ కింగ్
కింగ్ ఖాన్ ఆస్తులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. గత సంవత్సరం 870 మిలియన్ డాలర్ల నికర ఆస్తులతో అతడు జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.;
కింగ్ ఖాన్ షారుఖ్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న నటుడిగా రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 వివరాల ప్రకారం... ఖాన్ బిలియనీర్ క్లబ్ లో చేరారు. షారూఖ్ 33 ఏళ్ల సినీకెరీర్ లో రూ. 12,490 కోట్ల నికర సంపదలతో అద్భుతమైన ఆర్థిక మైలురాయిని అందుకున్నారని హురూన్ ప్రకటించింది.
హురూన్ ప్రకారం.. అంతర్జాతీయ వేదికపై షారుఖ్ అజేయంగా ఎదిగాడు. బాద్ షా రూ. 12,490 కోట్ల (1.4 బిలియన్ డాలర్లు) సంపదతో మొదటిసారిగా బిలియనీర్ క్లబ్‌లో చేరారు. షారూఖ్ పలువురు హాలీవుడ్ స్టార్లను సైతం వెనక్కి నెట్టాడు. టేలర్ స్విఫ్ట్, ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ , జెర్రీ సీన్‌ఫెల్డ్ , సెలీనా గోమెజ్ సహా పలువురు అంతర్జాతీయ ప్రముఖుల సంపదను షారూఖ్ సంపద మించిపోయింది.
కింగ్ ఖాన్ ఆస్తులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. గత సంవత్సరం 870 మిలియన్ డాలర్ల నికర ఆస్తులతో అతడు జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ఇప్పుడు 870 మిలియన్ డాలర్ల నుంచి 1.4 బిలియన్ డాలర్ల రేంజుకు అతడి సంపదలు ఎదిగాయి.
ఖాన్ కేవలం పారితోషికాల రూపంలోనే కాదు.. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ హౌస్, VFX స్టూడియో, పలు క్రికెట్ టీమ్‌లపై పెట్టుబడులు, విదేశాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు.. ఇవన్నీ అంతకంతకు ఘనమైన వృద్ధిరేటను నమోదు చేస్తున్నాయి. ఖాన్ తదుపరి కింగ్ అనే చిత్రంలో సుహానా ఖాన్ తో కలిసి నటిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా పూర్తవుతోందని సమాచారం. షారూక్ తన మూడు దశాబ్ధాల కెరీర్ లో మొదటిసారి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే. జవాన్ లో నటనకు గాను ఆయన ఈ పురస్కారం అందుకున్నారు.
హ్యుందాయ్, పెప్సీ , టిఏజీ హ్యూయర్ వంటి ప్రపంచ బ్రాండ్‌లను ఖాన్ ప్రమోట్ చేస్తున్నాడు. ఒక్కో బ్రాండ్ ప్రచారానికి రూ.5 -10 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఎండార్స్‌మెంట్‌లు - బ్రాండ్ భాగస్వామ్యాల ద్వారా ఏటా రూ.150 కోట్లకు పైగా సంపాదిస్తాడు.
SRK విలాసవంతమైన ఆస్తులలో మన్నత్ విలువ రూ.200 కోట్లు. దుబాయ్ , లండన్‌లోని విల్లాలు, కిడ్జానియా ఇండియా వంటి వెంచర్లలో పెట్టుబడులు ఉన్నాయి. ఖాన్ కి గ్యారేజీలో డజను పైగా విలాసవంతమైన కార్లు ఉన్నాయి. వీటన్నిటి విలువ సుమారు 20కోట్లు పైమాటే.