శ్రీనిధి ఖాతాలో మరో లక్కీ ఛాన్స్..?

స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ కలిసి చేయబోతున్న ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో శ్రీనిధి హీరోయిన్ గా పర్ఫెక్ట్ అని భావిస్తున్నారట.;

Update: 2025-06-12 03:15 GMT

తనకు కథ నచ్చి సినిమాలో తన పాత్ర నచ్చితే కానీ ప్రాజెక్ట్ ఓకే చేయని హీరోయిన్స్ చాలామంది ఉంటారు. అలాంటి సెలెక్టెడ్ సినిమాలు చేసే వారి లిస్ట్ లో కచ్చితంగా కె.జి.ఎఫ్ భామ శ్రీనిధి శెట్టి పేరు ఉంటుంది. యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన కె.జి.ఎఫ్ రెండు భాగాలతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించిన శ్రీనిధి శెట్టి ఆ సినిమా తర్వాత మాత్రం ఆ రేంజ్ దూకుడు చూపించలేదు. కె.జి.ఎఫ్ తర్వాత చియాన్ విక్రమ్ తో కలిసి కోబ్రా సినిమా చేసిన శ్రీనిధి అది ఫ్లాప్ అవ్వడంతో డీలా పడింది.

ఇక తెలుగులో సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా సైన్ చేశాక నాని హిట్ 3 ఆఫర్ రావడం అందులో నటించి ఆ సినిమా రిలీజై సూపర్ హిట్ అవ్వడం తెలిసిందే. నాని, శ్రీనిధి హిట్ 3 లో సూపర్ హిట్ జోడీ అనిపించుకున్నారు. ఐతే హిట్ 3 తర్వాత తెలుగులో తెలుసు కదా సినిమాతో వస్తుంది శ్రీనిధి శెట్టి. ఈ సినిమా అక్టోబర్ 17న రిలీజ్ అవుతుంది. సిద్ధు తో శ్రీనిధి మాత్రమే కాదు ఈ సినిమాలో రాశి ఖన్నా కూడా జత కడుతుంది.

ఇదిలా ఉంటే శ్రీనిధి శెట్టికి లేటెస్ట్ గా ఒక పాన్ ఇండియా సినిమా ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ కలిసి చేయబోతున్న ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో శ్రీనిధి హీరోయిన్ గా పర్ఫెక్ట్ అని భావిస్తున్నారట. ఆఫర్ రాగానే అమ్మడు ఏమాత్రం ఆలోచించకుండా ఓకే అనేసిందని తెలుస్తుంది. శ్రీనిధి చేయబోతున్న ఆ పాన్ ఇండియా సినిమా ఏంటన్నది త్వరలో తెలుస్తుంది.

ఐతే తెలుగు ఎంట్రీ కోసం కాస్త టైం తీసుకున్న శ్రీనిధి శెట్టి ఇక్కడ ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమకు ఫిదా అయ్యిందని తెలుస్తుంది. అందుకే తెలుగులో ఛాన్స్ వస్తే మాత్రం చేసేందుకే ప్రయత్నించేలా చూస్తుందట. ఇదివరకు తెలుగు ఆఫర్స్ వచ్చినా అంతగా ఆసక్తి చూపించని శ్రీనిధి శెట్టి హిట్ 3 టైం లో తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమను చూసి ఇక్కడ సినిమాలు కొనసాగించాలని ఫిక్స్ అయ్యింది. మరి శ్రీనిధి టాలీవుడ్ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి. కన్నడలో కూడా శ్రీనిధి ఇక మీదట వరుస సినిమాలు చేయాలని అనుకుంటుందట. కె.జి.ఎఫ్ తర్వాత సొంత భాషలో ఆఫర్లు లేక ఇబ్బంది పడిన శ్రీనిధి ఇక మీదట అన్ని భాషల్లో సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యిందట.

Tags:    

Similar News