చిరు కోసం ఓదెల స్పెషల్ పోస్ట్.. సినిమాపై బ్లడ్ ప్రామిస్!

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో అనేక మంది మెగాస్టార్ చిరంజీవి అభిమానులే ఉన్నారన్న విషయం తెలిసిందే.;

Update: 2025-08-22 15:06 GMT

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో అనేక మంది మెగాస్టార్ చిరంజీవి అభిమానులే ఉన్నారన్న విషయం తెలిసిందే. అందులో యువ దర్శకుడు, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కూడా ఒకరు. ఇప్పుడు చిరుపై ఉన్న తనకున్న అభిమానాన్ని ఆయన బర్త్ డే సందర్భంగా చాటుకున్నారు. తాజాగా స్పెషల్ పోస్ట్ పెట్టారు.

"నువ్వు నా డెమీ గాడ్. చిరంజీవితో ఒక ఫోటో దిగి ఇంట్లో అమ్మకు చూపెడితే ఫస్ట్ టైమ్ నువ్ ఫోటోలో నవ్వడం చూస్తున్నా రా అని చెప్పింది. అదే చిరంజీవిపై నా డెఫినిషన్. ఏం చేస్తాడు నీ చిరంజీవి అంటే.. నా లాంటి ఇంట్రావర్ట్ గాడితో ఇంద్ర స్టెప్ చేయించగలడు.. సినిమా టికెట్లు కొనుక్కునేవాడితో సినిమా తీయించగలడు" అని తెలిపారు.

"నీయమ్మ జీవితకాలం ఆడే సినిమా రా చిరంజీవి. ఇప్పుడు చిరంజీవితో సినిమా అంటే జీవితకాలం గుర్తుండిపోయేలా తీయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. అండ్ ఫైనల్లీ.. నేను ఆన్ స్క్రీన్ పై నా చిరంజీవిని మిస్ అవుతున్నా. ప్రామిస్ చేస్తున్నా. దాన్ని బ్యాక్ కు తెస్తా. నా కోసం నేనే తీస్తున్న సినిమా ఇది. నా లాంటి ప్రతి చిరంజీవి అభిమాని కోసం తీస్తున్న సినిమా చిరు-ఓదెల" అంటూ చెప్పుకొచ్చారు.

"ఇట్స్ ఎ బ్లడ్ ప్రామిస్. హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ చిరంజీవి సర్" అంటూ బర్త్ డే విషెస్ తెలిపారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిరుపై శ్రీకాంత్ ఎంత అభిమానమో బాగా తెలుస్తోందని అంటున్నారు. సినిమా కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నామని అంటున్నారు.

అయితే శ్రీకాంత్ ఓదెల, చిరంజీవి కాంబినేషన్ లో ఓ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. నేచురల్ స్టార్ నాని సమర్పిస్తున్న ఆ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆ సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో స్పెషల్ పోస్టర్ కూడా విడుదల చేశారు మేకర్స్.

చేతులకు రక్తం కారుతున్న పోస్టర్‌ ను షేర్‌ చేస్తూ.. హింసలోనే అతడు తన శాంతిని వెతుక్కున్నాడంటూ రాసుకొచ్చారు. అప్పట్లో ఆ అప్డేట్ సంచలనం సృష్టించింది. ఒక్కసారిగా సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. అయితే సినిమాలో వైలెన్స్ ఎక్కువగా ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాంగ్స్, హీరోయిన్స్ కూడా ఉండరని టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News