పెళ్లి విషయంలో కుండబద్దలు కొట్టిన శ్రీలీల
టాలీవుడ్‌లోప్రస్తుతం మంచి ఫామ్ తో పాపులారిటీ పొందిన యంగ్ హీరోయిన్ శ్రీలీల. వరుస అవకాశాలతో బిజీగా మారిన ఆమె, గ్లామర్‌తో పాటు డాన్సింగ్ స్కిల్స్‌తోనూ యూత్ మనసు దోచుకుంది.;
టాలీవుడ్‌లోప్రస్తుతం మంచి ఫామ్ తో పాపులారిటీ పొందిన యంగ్ హీరోయిన్ శ్రీలీల. వరుస అవకాశాలతో బిజీగా మారిన ఆమె, గ్లామర్‌తో పాటు డాన్సింగ్ స్కిల్స్‌తోనూ యూత్ మనసు దోచుకుంది. పెళ్లిసందడి తో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల, ధమాకా, గుంటూరు కారం వంటి సినిమాలతో క్రేజ్ పెంచుకుంది. ఇప్పుడు పవన్ కల్యాణ్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్', స్టార్స్ సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లాంటి ఆఫర్స్ తో బిజీగా ఉంది.
ఒకవైపు సినిమాల్లో దూసుకుపోతున్నప్పటికి, మరోవైపు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ యాక్టర్ కార్తీక్ ఆర్యన్‌తో ఆమె ప్రేమలో ఉందన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల, తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడింది. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
‘‘నాకు ఇప్పుడే 24 సంవత్సరాలు. నా జీవితంలో పెళ్లి అనేది 30 ఏళ్ల తరువాతే జరుగుతుంది. అప్పటివరకు నన్ను పెళ్లి గురించి ఎవరూ అడగవద్దు. ఇంకా ఎన్నో కలలతో కెరీర్‌ను నిలబెట్టుకోవాలని ఉంది. అబ్బాయిల గురించి ఇప్పుడే ఆలోచించాల్సిన అవసరం లేదు. పైగా నేను ఎక్కడికెళ్లినా మా అమ్మతోనే ఉంటాను. US ట్రిప్‌కి కూడా ఆమెతోనే వెళ్లాను. అలాంటి పరిస్థితుల్లో ప్రేమలో పడడం ఎలా సాధ్యమవుతుంది?’’ అని చెప్పిన శ్రీలీల స్పష్టంగా తన వైఖరిని వెల్లడించింది.
‘ప్రస్తుతం నేను లవ్‌లో ఉన్నానని చాలా మంది అనుకుంటున్నారు. కానీ నిజంగా అలాంటిదేం లేదు. నాపై వచ్చిన పుకార్లన్నీ అసత్యం. ఎప్పుడూ అమ్మ అండతోనే ఉంటాను. ఈ సమయంలో కెరీర్ మీద ఫోకస్ చేయడమే నాకు ముఖ్యం. ప్రేమకు సంబంధించి ఎవరితోనూ సంబంధం లేదు. గోల్స్ ఉన్నాయి.. వాటిని సాధించాకే వ్యక్తిగత విషయాలు ఆలోచిస్తా అంటూ అమ్మడు ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది.
ఇక ఆమె ఈ వ్యాఖ్యలతో, కార్తీక్ ఆర్యన్‌తో ఉన్న రిలేషన్‌పై కొనసాగుతున్న రూమర్స్‌కు ముగింపు పలుకుతుందా అనే చర్చ కూడా మొదలైంది. అయితే, నెటిజన్లు మాత్రం ఈ వ్యాఖ్యల్ని కూడా మరో కోణంలో విశ్లేషిస్తున్నారు. సినిమాల్లో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్‌పై ఇలా వార్తలు రావడం సర్వసాధారణమే అంటున్నారు. అయితే శ్రీలీల మాత్రం తన ప్రయాణాన్ని సీరియస్‌గా తీసుకుని, వ్యక్తిగత విషయాలకి బ్రేక్ ఇచ్చేలా కన్పిస్తుంది. మొత్తానికి, తన జీవితంపై వస్తున్న వదంతులకి శ్రీలీల స్పష్టతనిచ్చినట్లు భావిస్తున్నారు. మరి ఇప్పటికైనా బాలీవుడ్ రూమర్స్ ఆగుతాయో లేదో చూడాలి.