ఆయన ఒప్పుకున్నాక మరింత నమ్మా!
ఈ టాలెంటెడ్ నటుడు నటించిన తాజా సినిమా సింగిల్. ఆల్రెడీ ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండటంతో సింగిల్ పై మంచి అంచనాలేర్పడ్డాయి.;
కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసి వాటితో ఆడియన్స్ ను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ శ్రీవిష్ణు. ఈ టాలెంటెడ్ నటుడు నటించిన తాజా సినిమా సింగిల్. ఆల్రెడీ ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండటంతో సింగిల్ పై మంచి అంచనాలేర్పడ్డాయి.
సింగిల్ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా శ్రీవిష్ణు మీడియాతో మాట్లాడి సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు. డైరెక్టర్ కార్తీక్ రాజు చెప్పిన కథ తనకు బాగా నచ్చిందని, అందుకే వెంటనే ఈ సినిమాను ఓకే చేశానని శ్రీవిష్ణు చెప్పాడు. వెన్నెల కిషోర్ కూడా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్న తర్వాతే ఈ సినిమా 100% సక్సెస్ అవుతుందని భావించినట్టు కూడా శ్రీవిష్ణు తెలిపాడు.
సినిమాలో తనకు వెన్నెల కిషోర్ కు మధ్య వచ్చే సీన్స్ ఎంతో సరదాగా ఉంటాయని చెప్పిన శ్రీవిష్ణు ఈ సినిమాలోని లవ్ స్టోరీ చాలా కొత్తగా ఉంటుందని, గత సినిమాల కంటే ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా విభిన్నంగా ఉంటుందని చెప్పాడు. సింగిల్ సినిమా చాలా క్లియర్ గా, కుటుంబ సమేతంగా చూసి ఆనందించేలా ఉంటుంది శ్రీవిష్ణు వెల్లడించాడు.
సినిమాలో ఒక్క డల్ మూమెంట్ కూడా ఉండదని, సినిమా చూసినంతసేపూ నవ్వుతూనే ఉంటారని చెప్పిన శ్రీవిష్ణు ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ అందించిన మ్యూజిక్, బీజిఎం సినిమా స్థాయిని మరింత పెంచిందని చెప్పుకొచ్చాడు. విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా విజయంపై శ్రీవిష్ణు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.