• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప 2 ఐటెం సాంగ్...

పుష్ప 2 ఐటెం సాంగ్ హీరోయిన్ ఫిక్స్ అయినట్లేనా?

| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-11-02 04:21 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ఐదు భాషలలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ చివరి దశకి వచ్చేసిందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. అయితే సినిమాలో చాలా ప్రాధాన్యత ఉన్న ఐటెం సాంగ్ చిత్రీకరణ ఇంకా జరగలేదంట. నిజానికి ఐటెం సాంగ్ కోసం ఏ హీరోయిన్ ని అధికారికంగా కన్ఫామ్ చేయలేదని సమాచారం.

‘పుష్ప’ సినిమాలో సమంత చేసిన ఊ అంటావా సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ పాట ట్రెండ్ సెట్ చేసింది. ఏడాదికి పాటు అందరి మొబైల్స్ లో ఈ పాట వినిపిస్తూనే ఉండేది. అద్భుతమైన సాహిత్యంతో పాటు, దేవి శ్రీ ప్రసాద్ సూపర్ కంపోజింగ్, సమంత డాన్స్ పెర్ఫార్మెన్స్ ఈ పాటకి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చాయి. దీనికి దీటుగా ‘పుష్ప 2’ సినిమాలోని ఐటెం సాంగ్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఈ పాట కోసం చాలామంది హీరోయిన్స్ పేర్లు పరిశీలిస్తున్నారు. ‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి డిమ్రి పేరు కొద్ది కాలం పాటు వినిపించింది. అయితే ఆమెకు అంతగా డాన్స్ రాదని దిశ పటాని, శ్రద్ధ కపూర్ లలో ఒకరిని కన్ఫామ్ చేయాలని అనుకున్నారు. వారు ఉంటే హిందీలో కూడా కొంత అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని భావించారు. అయితే ఈ పాట కోసం బాలీవుడ్ బ్యూటీస్ ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగా వారిని సుకుమార్ పక్కన పెట్టారంట.

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆరంభంలో ఆమెను సంప్రదించిన పెద్దగా ఆసక్తి చూపించలేదని ప్రచారం నడిచింది. అయితే మరోసారి ఇప్పుడు శ్రీలీల పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆమె మంచి డాన్సర్ అనే సంగతి అందరికి తెలిసిందే. అలాగే ఆమె ఎక్స్ ప్రెషన్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. అందుకే సుకుమార్ శ్రీలీల అయితే పర్ఫెక్ట్ అనుకుంటున్నారంట. సమయం కూడా తక్కువగా ఉండడంతో వీలైనంత వేగంగా ఆమెను కన్ఫర్మ్ చేసి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అనుకుంటున్నారు.

అలాగే షూటింగ్ కూడా స్టార్ట్ చేసి త్వరగా ఫినిష్ చేయాలని భావిస్తున్నారంట. శ్రీలీల అయితే డాన్స్ పరంగా అసలు వంక పెట్టాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ తో పోటీపడి మరి ఆమె డాన్స్ చేయగలదు. గతంలో ఆహ యాప్ ప్రమోషన్ యాడ్ లో అల్లు అర్జున్ తో కలిసి శ్రీలీల నటించింది. వారి ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంటుందనే మాట వినిపిస్తోంది. త్వరలో ఐటెం సాంగ్ కి సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు.

Tags:    
  • Alluarjun 
  • Pushpa2 
  • Sreeleela 
  • Rashmika 
  • Shraddhakapoor 
  • Sukumar 
  • Pushpa2itemsong 
  • Tollywood 
  • Filmindustry 
  • Mythrimoviemakers 

Similar News

అన్ని రకాల జంతువులను రుచి చూశా.. ఆయన వల్లే సాధ్యం అంటున్న శృతిహాసన్!

2026-11-18 11:30 GMT

చిరు, నాగ్‌ను చూసి యంగ్‌ హీరోలు నేర్చుకోవాలి!

2026-11-18 11:19 GMT

స్టార్ హీరో వైఖ‌రి దారుణం అంటూ వాపోయిన న‌టి

2026-11-18 11:11 GMT

'రణబాలి' లో ఆ ఒక్కటి మిస్ అయిందా?

2026-11-18 10:30 GMT

25 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ హిట్ జోడీ!

2026-11-18 10:01 GMT

టాలీవుడ్ లో శ్రీలీల ఖాళీ గా అందుకేనా?

2026-11-18 09:53 GMT

తాగుబోతు పాత్ర కోసం మందు తాగారా?

2026-11-18 09:52 GMT

క‌రాటే చంద్ర‌న్ కోసం క‌రాటే ప్రాక్టీస్ చేస్తున్నాడు!

2026-11-18 09:51 GMT

గోదారి గట్టు, మీసాల పిల్లను మించి మరోటి..!

2026-11-18 07:46 GMT

నిజ జీవితంలోనూ గ్రేట్.. మనవళ్లతో గ్రీస్ వెకేషన్‌లో తలైవా!

2026-11-18 07:46 GMT

గ్రీస్ వెకేషన్‌లో స్టార్‌క‌పుల్ రొమాన్స్.. వ‌య‌సు ఒక అంకె మాత్ర‌మే!

2026-11-18 07:46 GMT

స్కూల్‌లో మొదలైన పరిచయం... తన భార్య అమల్‌తో లవ్ స్టోరీ చెప్పిన దుల్కర్ సల్మాన్!

2026-11-18 07:24 GMT

Copyright @2026

Powered by Blink CMS