తెలుగమ్మాయిలను వెంటాడుతోన్న కొత్త సెంటిమెంట్
ఎవరికైనా, ఎంత టాలెంట్ ఉన్నా టైమొస్తే కానీ వారికి రావాల్సిన గుర్తింపు రాదు. సినీ ఇండస్ట్రీలో అయితే ఎవరికెప్పుడు టైమొస్తుందో ఎవరూ చెప్పలేరు.;
ఎవరికైనా, ఎంత టాలెంట్ ఉన్నా టైమొస్తే కానీ వారికి రావాల్సిన గుర్తింపు రాదు. సినీ ఇండస్ట్రీలో అయితే ఎవరికెప్పుడు టైమొస్తుందో ఎవరూ చెప్పలేరు. అయితే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ కొత్త సెంటిమెంట్ వినిపిస్తోంది. తెలుగమ్మాయిలను కోలీవుడ్ గుర్తిస్తే కానీ టాలీవుడ్ లో సరైన గుర్తింపు దక్కడం లేదనే అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.
అంజలి, శ్రీదివ్య, ఆనంది, ఐశ్వర్య రాజేష్.. వీళ్లంతా కోలీవుడ్ లో నిరూపించుకున్న తర్వాతే టాలీవుడ్ లో సక్సెస్ కాగా ఇప్పుడా లిస్ట్ లోకి మరో తెలుగమ్మాయి చేరారు. ఆమె మరెవరో కాదు, శ్రీగౌరీ ప్రియ. వాస్తవానికి శ్రీగౌరీ మ్యాడ్ కంటే ముందు 6 సినిమాలకు పైగా చేశారు కానీ అవేవీ అమ్మడికి గుర్తింపుని తెచ్చిపెట్టలేదు కానీ ఏ ముహూర్తాన ట్రూ లవర్ చేశారో కానీ ఆ సినిమా అమ్మడి జాతకాన్ని ఒక్కసారిగా మార్చేసింది.
వాస్తవానికి శ్రీ గౌరీకి మ్యాడ్ సినిమాతో మంచి గుర్తింపే వచ్చింది కానీ అందులో ఆమె సెకండ్ హీరోయిన్. దాని కంటే ముందు పలు సినిమాలు, ఓటీటీ మూవీస్ చేసినప్పటికీ వాటితో శ్రీగౌరీకి అసలు గుర్తింపు రాలేదు. అయితే శ్రీ గౌరీ యాక్టింగ్ కెరీర్ మోడన్ లవ్ చెన్నై అనే కోలీవుడ్ సినిమాతో మొదలైంది. అలా కెరీర్ ను స్టార్ట్ చేసిన శ్రీ గౌరీ పలు సినిమాలు చేసినప్పటికీ తగిన గుర్తింపు మాత్రం ట్రూ లవర్ తోనే అందుకున్నారు.
ట్రూ లవర్ తర్వాత శ్రీగౌరీకి మంచి ఆఫర్లు వస్తున్నాయి. అందులో భాగంగానే ఆల్రెడీ కిరణ్ అబ్బవరం తో కలిసి చెన్నై లవ్ స్టోరీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు శ్రీగౌరీకి ఓ బంపరాఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అశోక్ గల్లా హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న వింటావా సరదాగాలో శ్రీగౌరీ ప్రియ హీరోయిన్ గా నటిస్తున్నారు. మాస్టర్స్ కోసం విదేశాలకు వెళ్లిన యువత పడే కష్టాలు, అక్కడ ఏర్పడే స్నేహం, ప్రేమ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండనుందట.